Sridevi Soda Center: శ్రీదేవి సోడా సెంటర్... వెండి తెరపై ఈ గోలి సోడా పేలుతుందా...?

ట్రైలర్ తో ఇండస్ట్రీలో హైప్ పెంచిన "శ్రీదేవి సోడా సెంటర్" సినిమా ఈ రోజే విడుదలైంది, సినిమా ఎలా ఉందో, నటీనటుల నటన ఎలా ఉందో మీరే చూడండి!  

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 27, 2021, 07:05 PM IST
  • ఈ రోజే విడుదలైన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా
  • మంచి టాక్ సొంతం చేసుకున్న సినిమా
  • ట్రైలర్ తో హైప్ పెంచిన శ్రీదేవి సోడా సెంటర్
Sridevi Soda Center: శ్రీదేవి సోడా సెంటర్... వెండి తెరపై ఈ గోలి సోడా పేలుతుందా...?

'పలాస 1978' సినిమాతో (Palasa 1978) టాలీవుడ్‌లోకి (Tollywood) ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు కరుణ కుమార్ (Karun Kumar) సుధీర్ బాబు (Sudheer Babu), ఆనంది (Anandi) హీరో హీరోయిన్లుగా తెరకెక్కించిన తాజా చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్.' (Sridevi soda center) తొలి సినిమా 'పలాస'తో సమాజంలో పాతుకుపోయిన కుల వివక్షను ఉత్తరాంధ్ర నేపథ్యంలో బలమైన కథ,కథనాలతో కరుణ కుమార్ తెరపై ఆవిష్కరించారు.

విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆ చిత్ర దర్శకుడి నుంచి వస్తున్న తదుపరి చిత్రం కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా హిట్టా ఫట్టా అనేది మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది.

Also Read: Free Internet in Hyderabad: ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.. ఉచితంగా అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ డేటా!

శ్రీదేవి సోడా సెంటర్ కథపై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. సినిమాలో ప్రేమ కథతో పాటు కుల వివక్ష కోణాన్ని కూడా కరుణ్ కుమార్ టచ్ చేశారు. నాగేంద్ర కాశీ (Nagendra Kashi) అనే సాహిత్య నేపథ్యం ఉన్న కథా రచయిత ఈ సినిమాకు కథ అందించారు. సినిమాలో హీరో సుధీర్ బాబు ఎలక్ట్రిషియన్ సూరిబాబు (Suribabu Charector) పాత్రలో నటించగా.. హీరోయిన్ ఆనంది సోడా సెంటర్ నిర్వహించే శ్రీదేవి (Sreedevi) పాత్రలో నటిస్తోంది. ఈ ఇద్దరు ప్రేమలో పడటం... వీరి ప్రేమకు కులం అడ్డు గోడలా మారడం... ఆ పరిణామాల నేపథ్యంలో కథ సాగుతుంటుంది.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ను గమనిస్తే.. అందులో హీరోయిన్ తండ్రి చెప్పే ఒక డైలాగ్‌ను గమనించవచ్చు.'మంచివాడే కానీ... మనోడు కాదు..' అంటాడు. దీన్నిబట్టి ప్రేమ,పరువు అనే అంశాల చుట్టూ కథ తిరుగుతుందనేది ఎవరికైనా అర్థమైపోతుంది. అదే గ్రామానికి చెందిన పంచాయతీ ప్రెసిడెంట్ (Panchayat President) కొడుకు కూడా శ్రీదేవిపై మనసు పడుతాడని తెలుస్తోంది. అతని రూపంలో సూరిబాబు ప్రేమ కథలోకి మరో విలన్ ఎంట్రీ ఇచ్చినట్లవుతుంది. ఓవైపు ప్రేమకు కులం అడ్డంకిగా మారడం,పంచాయతీ ప్రెసిడెంట్ కొడుకు శ్రీదేవిపై మనసు పడటం... అదే సమయంలో హీరో సుధీర్ బాబు గ్రామంలో జరిగే ఓ హత్య కేసులో ఇరుక్కోవడంతో కథ మరో మలుపు తిరుగుతుందని చెబుతున్నారు. ఆ హత్యతో అసలు సుధీర్ బాబు‌కు (Sudher Babu) ఏం సంబంధం... ఆ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన సుధీర్ బాబు... ఆ తర్వాత తన ప్రేమ వ్యవహారాన్ని ఎలా డీల్ చేశాడనేది అసలు కథగా చెబుతున్నారు.

Also Read: ICGS Vigraha Ship : భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..తీర భద్రత కోసం 'విగ్రహ'

నిజానికి ఇలాంటి ప్రేమ కథలు గతంలో చాలానే వచ్చాయి. ఇదే ప్రేమ కథా,కుల వివక్ష కోణంలో వచ్చిన ఉప్పెన సినిమా ఇంకా ప్రేక్షకుల మదిలోనే ఉంది. ఇప్పుడదే బాటలో వచ్చిన శ్రీదేవి సోడా సెంటర్(Sridevi soda Center)... దాని కంటే భిన్నంగా ఉందా, లేక పాత సీసాలో కొత్త నీరు పోసినట్లుగా ఉందా అనేది ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. 'వి' (V Movie) సినిమా పరాజయం తర్వాత సుధీర్ బాబు‌కు అర్జెంట్‌గా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దర్శకుడు కరుణ కుమార్ సుధీర్‌ బాబుకు హిట్ ఇవ్వడంలో ఎంత మేర సక్సెస్ అవుతారో చూడాలి.

పలాస సినిమాతో విభిన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నప్పటికీ... ఆ సినిమా ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ అవలేదు. కాబట్టి కరుణ కుమార్ ఈ సినిమాతో కమర్షియల్ డైరెక్టర్‌గా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సినిమా అటు సుధీర్ బాబుకు,ఇటు కరుణ కుమార్‌కు అగ్ని పరీక్షే అని చెప్పాలి.

Also Read: Frederique Overdijk: 4 ఓవర్లలో 7 వికెట్లు తీసి T20Is వరల్డ్ రికార్డ్ నెలకొల్పిన పేసర్ ఫ్రెడ్రిక్

శుక్రవారం (ఆగస్టు 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు... ఇప్పటివరకూ వచ్చిన ట్రెండ్స్‌ను పరిశీలిస్తే డివైడ్ టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం కొంతమంది సినిమాపై మంచి రివ్యూలు రాశారు. చూడాలి మరి... శ్రీదేవి సోడా జనాలకు అనుకున్నంత కిక్కు ఇస్తుందో లేదో...!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News