Praneeth Hanumanthu Viral Post: గత కొద్దిరోజులగా సోషల్ మీడియాలో ప్రణీత్ హనుమంతు కాంట్రవర్సీ దుమారం రేపుతోంది. కొద్ది రోజుల క్రితం యూట్యూబర్ ప్రణీత్.. అతని ఫ్రెండ్స్ కొంతమంది చేసిన ఒక.. వికృత మాటల వీడియో వైరల్‌గా మారింది. తండ్రీకూతుర్ల రిలేషన్‌కు.. శారీరక సంబంధం అంటగడుతూ.. మళ్లీ దానికి డార్క్ హ్యూమర్ అనే పేరు పెట్టి.. ఒక వీడియో చేశారు. ఆ మొత్తం వీడియోలో అసభ్యకరంగా ఉన్న ఓ పార్ట్‌ను కట్ చేసి..కొందరు సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ప్రతి ఒక్కరూ ఈ వీడియో పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఈ ప్రణీత్ హనుమంతు.. ఈ మధ్యనే సుధీర్ బాబు హీరోగా.. నటించిన హరోం హర.. సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించారు. దాంతో ఈ వ్యక్తి గురించి సోషల్ మీడియాలో ప్రస్తావించిన ప్రతి దగ్గర.. ఇతను హరోం హర నటుడు అంటూ కూడా పోస్టులు పెట్టారు చాలామంది. ఇక తాజాగా దీని గురించి సుదీర్ బాబు.. రియాక్ట్ అయ్యారు. అలాంటి వ్యక్తికి సినిమాలు ఆకాశం ఇచ్చినందుకు..బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారు.
"మంచికో చెడుకో కానీ.. నేను సోషల్ మీడియా వ్యక్తిని కాదు. సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది.. అని పెద్దగా పాటించుకోను. కానీ ప్రణీత్ హనుమంతుని మా సినిమాలో తీసుకున్నందుకు.. చాలా సిగ్గుపడుతున్నాము. నా తరపు నుంచి మా చిత్ర బృందం తరపు నుంచి మీ అందరికీ క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. అతను ఇలాంటి మనిషి.. అని మేము అనుకోలేదు" అని అన్నారు సుధీర్ బాబు.
"సోషల్ మీడియా అతని గురించి బయటపెట్టిన విషయాలను పూర్తిగా చదివేందుకు కూడా ధైర్యం చేయలేదు. ఆ విషయాలు.. మనం చూసేందుకు కూడా అర్హత లేనివి, కానీ ఈ సమయంలో అవి మన దృష్టిలోకి రావాలి. ఇలాంటి వాళ్ళ నీచపు ఆలోచనలు.. పంచుకునేందుకు ఒక ప్లాట్ఫారం కూడా ఉండకూడదు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మాట స్వేచ్ఛ.. కాదని అర్ధం చేసుకోవాలి." అని సుధీర్ బాబు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
దీంతో లేటుగా స్పందించిన కూడా సుధీర్ బాబు ఈ విషయం గురించి కరెక్ట్ గా మాట్లాడినందుకు.. అభిమానులు సంతోషిస్తున్నారు. ఇలా బహిరంగంగా క్షమాపణలు చెప్పినందుకు అభిమానులు సుధీర్ బాబు పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సుధీర్ బాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
For good or bad, I'm not a social media guy nor do I keep up with things. I feel so disgusted by the fact we had #PraneethHanumanthu casted in #HaromHara. Sincere apologies from me and my entire team. We didn't know what a pathetic creature this man is. It wasn't in my knowledge.…
— Sudheer Babu (@isudheerbabu) July 8, 2024
Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..
Read more:Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి