SVP Trailer Review & Rating: సర్కారు వారి పాట టీజర్ రివ్యూ, రేటింగ్ ఎలా ఉందంటే.. ??

Sarkaru vaari paata trailer review & rating: సూపర్‌స్టార్ మహేశ్ బాబు  కొత్త సినిమా ట్రైలర్ అదిరింది. సర్కారు వారిపాట ట్రైలర్ అదరగొడుతోంది. అభీ పిక్చర్ బాఖీ హై అంటున్న ట్రైలర్ రివ్యూ, రేటింగ్ ఎలా ఉందో చూసేద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 2, 2022, 05:17 PM IST
SVP Trailer Review & Rating: సర్కారు వారి పాట టీజర్ రివ్యూ, రేటింగ్ ఎలా ఉందంటే.. ??

Sarkaru Vaari Paata Trailer Review & Rating: సూపర్‌స్టార్ మహేశ్ బాబు  కొత్త సినిమా ట్రైలర్ అదిరింది. సర్కారు వారిపాట ట్రైలర్ అదరగొడుతోంది. అభీ పిక్చర్ బాఖీ హై అంటున్న ట్రైలర్ రివ్యూ, రేటింగ్ ఎలా ఉందో చూసేద్దాం..

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేశ్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12న విడుదలకు సిద్ధమైంది. ఇవాళ సర్కారు వారి పాట ట్రైలర్ విడుదలైంది. ఊహించినట్టుగానే క్లాస్, మాస్, కామెడీ, యాక్షన్ సీక్వెన్స్‌లతో సినిమాపై అంచనాల్ని ఈ ట్రైలర్ పెంచుతోంది. పోకిరి 2 లా ఉంటుందని చెప్పినట్టుగానే పరశురామ్ అన్ని మసాలాల్ని సినిమాలో వండివార్చినట్టు ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మించాయి. ట్రైలర్ చూస్తుంటే యాక్షన్, కామెడీ, లవ్ ట్రాక్ బాగున్నట్టుగా అన్పిస్తోంది. ముఖ్యంగా మహేశ్ బాబు, కీర్తి సురేష్ మధ్య లవ్ ట్రాక్ బాగా పండినట్టుగానే ఉంది. సినిమాకు ఇది హైలైట్ కావచ్చని అంచనా. అదే సమయంలో దర్శకుడు పరశురామ్ డైలాగ్స్ పరంగా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నాడు.

ఇక అన్నింటికంటే ముఖ్యంగా మహేశ్ బాబు, కీర్తి సురేష్‌లు సినిమాలో చాలా అందంగా, ఎనర్జిటిక్‌గా, ర్యావిషీగా  కన్పిస్తున్నారు. సర్కారు వారి పాట సినిమా పూర్తి రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందనేది అంచనా.తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. పాటలు ఇప్పటికే హైలైట్‌గా నిలిచాయి. అందుకే సింపుల్‌గా చెప్పాలంటే..ఇవాళ విడుదలైన ట్రైలర్ అభీ పిక్చర్ బాఖీ హై అంటోంది.

ఇక డైలాగ్స్ విషయంలో ట్రైలర్ విషయంలో ఓ డైలాగ్ బాగా ఆకట్టుకుంటోంది. అప్పు ఆడపిల్ల లాంటిది..ఇక్కడెవరూ బాధ్యత కలిగిన ఆడపిల్ల తండ్రిలా కన్పించడం లేదని మహేశ్ బాబు చెబుతుంటే..అప్పు సెటప్ లాంటిదని విలన్ అనడం డైలాగ్స్ పరంగా పరశురామ్ ఎంత జాగ్రత్తగా ఉన్నాడో చెబుతుంది. ఇక ఓవరాల్ రేటింగ్ విషయానికొస్తే 5కు  4 వరకూ ఇవ్వచ్చు.

Also read: Sarkaru Vaari Paata Trailer: సర్కారు వారి పాట ట్రైలర్ రిలీజ్.. మహేశ్‌ బాబు అభిమానులకు పూనకాలే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News