బాలీవుడ్ నటుడు సుశాంత్ సింహ్ రాజ్ పుత్ ( Sushant singh Rajput ) మరణం వ్యవహారంలో రోజురోజుకూ సరికొత్త పరిణాలు చోటుచేసుకుంటున్నాయి. సుశాంత్ సింగ్..తన సోదరి వ్యవహారంపై బాధపడుతున్నట్టుగా రియా చక్రవర్తి ( Rhea Chakroborty ) ఆరోపించడం, సుశాంత్ సోదరి ఖండించడం ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది.
బాలీవుడ్ నటుడు ( Bollywood actor ) సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై ( Sushant death case ) ప్రతిరోజూ కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. సుశాంత్ సింగ్ కు అతని కుటుంబ సభ్యులకు మధ్య సాన్నిహిత్యమే సరిగ్గా ఉండేది కాదనే ఆరోపణలు వస్తున్నాయి. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ ( Sushant girl friend ) రియా చక్రవర్తి ఇప్పుడు మొత్తం వ్యవహారంలో కీలకంగా మారింది. ఈడీ ( ED case ) ఇప్పటికే ఆమెను విచారించింది. సీబీఐ విచారిస్తోంది. ఈ నేపధ్యంలో రియా చక్రవర్తి సరికొత్త ఆరోపణలు చేస్తూ అందుకు సంబంధించిన వాట్సప్ చాట్ స్క్రీన్ షాట్లను ( Whatsapp chat screenshots ) షేర్ చేస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన సోదరి ప్రియాంక ( priyanka ) ప్రవర్తనపై బాధపడుతూ తనకు చేసిన వాట్సప్ చాట్ ను రియా విడుదల చేయడం కొత్త వివాదానికి దారి తీస్తోంది. రియా, సుశాంత్ ల మధ్య దూరం పెంచేందుకు సిద్ధార్ద్ ను ప్రియాంక ప్రేరేపించినట్టు వాట్సప్ మెస్సేజెస్ లో సుశాంత్ పేర్కొన్నట్టుగా ఆ స్క్రీన్ షాట్లలో ఉంది.
అయితే ఈ ఆరోపణల్ని సుశాంత్ మరో సోదరి శ్వేతా సింగ్ కీర్తి ( Swetha singh keerthi ) తోసిపుచ్చింది. తనతోనూ, సోదరి ప్రియాంకతోనూ సుశాంత్ అన్యోన్యంగా ఉండేవాడని చెప్పడమే కాకుండా...తమ అనుబంధాన్నిచెప్పే మరో వాట్సప్ చాట్ ను, వీడియోను శ్వేతా సింగ్ విడుదల చేశారు. సుశాంత్ మృతికి అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కారణమంటూ సుశాంత్ తండ్రి ఫిర్యాదు సంగతి తెలిసిందే. రియా చక్రవర్తి ఇప్పుడు సీబీఐ ( CBI case ) తో పాటు ఈడీ కేసు కూడా ఎదుర్కొంటోంది. Also read: Tuck Jagadish: టక్ జగదీష్ మూవీలో నాని పాత్ర ఇదేనా ?