Kantara - Rangasthalam : రంగస్థలంతో కాంతారా పోలికలు.. ఈ సీన్లతోనే అలాంటి మాటలా?

Kantara With Ram Charan Rangasthalam కాంతారా సినిమాను చూసిన తెలుగు ప్రేక్షకుల్లో కొంత మంది దాన్ని రంగస్థలం సినిమాతో పోల్చుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 16, 2022, 03:16 PM IST
  • కన్నడలో కాంతారా ప్రభంజనం
  • రంగస్థలంతో పోలికలు పెడుతున్న జనాలు
  • ఆ సీన్ల వల్లే అలా అనిపిస్తోందా?
Kantara - Rangasthalam : రంగస్థలంతో కాంతారా పోలికలు.. ఈ సీన్లతోనే అలాంటి మాటలా?

Kantara - Rangasthalam : కాంతారా సినిమాకు రంగస్థలం సినిమాకు మధ్య పోలీకలు వినిపించడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ కనిపించకపోవచ్చు. గ్రామీణ నేపథ్యం ఉండటం, ఊర్లోని పరిస్థితులు, ఊరి పెద్దగా మంచిగా నటిస్తూ ఉండే వాడే చివరకు విలన్ అవ్వడం, హీరో సోదరుడిని చంపేయడం, చివరకు ఆ నిజం హీరో తెలుసుకోవడం, కథ ముగించడం ఇలా పైపైన చూస్తే కాంతారా సినిమాను రంగస్థలంతో పోల్చుకోవచ్చు.

కానీ కాంతారా సినిమాను తీసిన విధానం, రంగస్థలంను తెరకెక్కించిన విధానం రెండూ వేర్వేరు. అయితే అందులోనూ భూమి, భూస్వామి అనే కాన్పెప్ట్ ఉంటుంది. కాంతారా కూడా భూమి చుట్టే తిరుగుతుంది. రంగస్థలం సినిమాతో కాంతారాను పోల్చడానికి చాలా కారణాలుంటాయి. కానీ ఈ రెండు చిత్రాలు చూసినప్పుడు కలిగే ఫీలింగ్స్ వేరు. రంగస్థలంలోనూ క్లైమాక్స్ ఓ రేంజ్‌లో ఉంటుంది. కానీ కాంతారా క్లైమాక్స్ నెవ్వరో బిఫోర్ అనేలా ఉంటుంది.

రిషభ్ శెట్టి నటనను పోల్చడానికి వీలుండదు. దేవుడి పూనితే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించాడు. నట విశ్వరూపం, శివ తాండవం అనే పదాలకు రిషభ్ శెట్టి నటన ఓ ఉదాహరణగా నిలుస్తుంది. అతని నటనను చూసి అందరూ మంత్రముగ్దులవ్వాల్సిందే. రచయితగా, దర్శకుడిగా, హీరోగా రిషబ్ శెట్టి కాంతారా సినిమాను ఎవరెస్ట్ అంచున నిలబెట్టేశాడు. కొందరు ఈ చిత్రాన్ని కన్నడ రంగస్థలం అని కూడా అంటున్నారు.

అయితే ఇలా పోల్చాల్సిన అవసరం లేదని, దేని గొప్ప దానిదే అంటున్నారు నెటిజన్లు. మొత్తానికి కాంతారా చిత్రం మాత్రం ఇప్పుడు దేశస్థాయిలో ట్రెండ్ అవుతోంది. హిందీలో ఈ చిత్రం రోజురోజుకూ పుంజుకుంటోంది. ఇక తెలుగులో అయితే ఒక్క రోజులోనే బ్రేక్ ఈవెన్ అయింది. రెండు కోట్ల బిజినెస్ చేస్తే.. మొదటి రోజే ఐదు కోట్ల గ్రాస్, రెండున్నర కోట్ల షేర్ సాధించి బ్రేక్ ఈవెన్ కొట్టేసినట్టు తెలుస్తోంది.

హోంబలే సంస్థ నిర్మించిన ప్రతీ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుండటంతో అందరూ ఆశ్చర్యపోతోన్నారు. గ్రాండియర్ చిత్రాలకు హోంబలే కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది. కాంతారా చిత్రంతో హోంబలే మరోసారి దేశ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇక రాబోయే రోజుల్లో సలార్ సినిమాతో హోంబలే ట్రెండ్ క్రియేట్ చేయనుంది.

Also Read : Balakrishna - Rashmika : బాలయ్యను పడగొట్టేసిన రష్మిక మందన

Also Read : Chandini Chowdary Photoshoot : పిచ్చెక్కించేలా చాందినీ చౌదరి అందాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News