Indian Idol 3 Telugu: సంగీత ప్రపంచంలో మరో బెంచ్‌మార్క్ సెట్ చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 గాలా..

Indian Idol 3 Telugu: తెలుగులో ఒకప్పుడు దివంగత ఎస్పీ బాలు హోస్ట్ చేసిన ‘పాడుతా తీయగా’ తర్వాత ఈ రేంజ్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న మ్యూజిక్ రియాల్టీ షో ‘ఇండియన్ ఐడల్ సీజన్ 3’. తాజాగా ఈ ప్రోగ్రామ్ మరో బెంచ్ మార్క్ సెట్ చేసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 3, 2024, 10:08 AM IST
Indian Idol 3 Telugu: సంగీత ప్రపంచంలో మరో బెంచ్‌మార్క్ సెట్ చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 గాలా..

Indian Idol 3 Telugu: మ్యూజిక్ వరల్డ్ లో  మరో బెంచ్‌మార్క్ సెట్ చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 గాలా.  
టాప్ 12 సింగర్స్‌తో కూడిన తెలుగు ఇండియన్ ఐడల్ 3 గ్రాండ్ గాలా, తెలుగులో రియాల్టీ షోలలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.   ఈ సీజన్ గ్రాండ్ గాలా ప్రేక్షకులతో పాటు జడ్జెస్ ను  మెస్మరైజ్ చేస్తోంది. గ్రాండ్ గాలా ఎపిసోడ్స్ ఆడియన్స్ కి కొత్త ఎక్స్ పీరియన్స్ పంచాయి.  చెన్నై స్ట్రింగ్స్ ఆర్కెస్ట్రా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు.

టాలెంటెడ్ కంపోజర్ థమన్, యువ గాయకుడు  స్కందతో కలిసి వేదికపైకి వచ్చారు. వారిద్దరి పెర్ఫార్మెన్స్ చూసే వాళ్లలో  ఎనర్జీని నింపింది. థమన్, కార్తీక్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలైన "గేమ్ ఛేంజర్", "పుష్ప 2"లో తమ పని గురించి చెప్పడం  అందరినీ అలరించింది,
థమన్ తన సూపర్ హిట్ "మగువా మగువా" పాట వెనుక స్ఫూర్తిని పంచుకోవడం హార్ట్ టచ్చింగ్ మూమెంట్. తన తల్లికి జ్జాపాకర్ణం ఈ పాట చేశానని చెప్పడం అక్కడి కంటెస్టెంట్స్ తో పాటు చూసే ఆడియన్స్ లో జోష్ నింపింది.   

ప్రముఖ సంగీత దర్శకుడు  మాస్ట్రో ఇళయరాజాకి శ్రీ కీర్తి యొక్క అద్భుత ప్రదర్శన యొక్క వీడియోను పంపాలని కార్తీక్ డిసైడ్ అవ్వడం మరో హైలెట్.  

యంగ్ సింగర్ కీర్తన జడ్జ్ కార్తీక్‌కు మ్యూజిక్ పాఠాలు చెప్పడం మరో హైలెట్ గా నిలిచింది. ఇది నెక్స్ట్ జనరేషన్ ట్యాలెంట్ ప్రజెంట్ చేసింది. మొత్తనికి సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 గ్రాండ్ గాలా మస్ట్ వాచ్ షో గా ఆహాలో నిలిచింది.
సంగీత ప్రియుల ఫేవరేట్ తెలుగు ఇండియన్ ఐడల్ 3  ఆహాలో ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతుంది.

Read more:Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News