మూవీ రివ్యూ: 'ఫ్యామిలీ స్టార్'(Bheema)
నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, దివ్యాంశ కౌశిక్, జగపతి బాబు, వెన్నెల కిషోర్, రోహిణి హట్టంగడి, అజయ్ ఘోష్, తదితరులు..
సినిమాటోగ్రఫీ: కేయూ మోహనన్
మ్యూజిక్: గోపీ సుందర్
ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్
నిర్మాత: దిల్ రాజు, శిరీష్
దర్శకత్వం: పరశురామ్
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ది ఫ్యామిలీ స్టార్'. ఇప్పటి వరకు యూత్‌ఫుల్ లవబుల్ మూవీస్ చేసిన దేవరకొండ.. ఇపుడు కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ 'ది ఫ్యామిలీ స్టార్' మూవీతో పలకరించారు. మరి ఈ మూవీ ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
'ది ఫ్యామిలీ స్టార్' కథ విషయానికొస్తే.. గోవర్ధన్ (విజయ్ దేవరకొండ) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తుంటాడు. అతనికో ఇద్దరు అన్నలు, వదినలు, ఓ నానమ్మ ఇది అతని ఫ్యామిలీ. కుటుంబం కోసం ఎదుటి వాళ్ల కాళ్లు పట్టుకోవడానికైనా.. కాలర్ పట్టుకోవడానికైనా వెనకాడని మనస్తత్త్వం. కుటుంబ అవసరాల కోసం తన సరదాలు మానుకునే ఓ మిడిల్ క్లాస్ మెంటాలిటీ. అలాంటి ఫ్యామిలీలోకి ఇందు (మృణాల్ ఠాకూర్) ప్రవేశిస్తోంది. గోవర్ధన్ ఇంట్లో టెనెంట్‌గా దిగుతోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఓ థీసిస్ పై రీసెర్చి చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో గోవర్ధన్, ఇందు ఒకరినొకరు ఇష్టపడతారు. ఆ తర్వాత జరిగిన ఓ సంఘటనతో వీళ్లిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి. వీళ్లిద్దరు విడిపోవడానికి కారణం ఏమిటి ? ఆ తర్వాత వీళ్లు ఎలా దగ్గరయ్యారనేద 'ది ఫ్యామిలీ స్టార్ మూవీ స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
ప్రతి కుటుంబంలో ఓ వ్యక్తి ఉంటాడు. అతని ద్వారా ఆ ఫ్యామిలీకి సమాజంలో గుర్తింపు వస్తోంది. అలాంటి వ్యక్తి ప్రతి ఇంట్లో ఉంటాడు. కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే ప్రతి వ్యక్తి ఆ ఫ్యామిలీకి స్టార్. అదే 'ఫ్యామిలీ స్టార్' కథ. ఇలాంటి తరహా కథ ఈ మధ్య కాలంలో తగ్గాయి. కానీ ఒకప్పుడు అందరు స్టార్ హీరోలు ఇలాంటి తరహా కథలతో ప్రేక్షకులను మెప్పించారు. ఒకప్పటి శోభన్ బాబు.. మహారాజు, చిరంజీవి.. మగమహారాజు, జయప్రద.. అంతులేని కథ లాంటి చిత్రాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా కుటుంబం కోసం సర్వం త్యాగం చేసే కథా బలం ఉన్న చిత్రాలు తెలుగులో ఎన్నో వచ్చాయి. తాజాగా దర్శకుడు పరశురామ్ కూడా కుటుంబం కోసం ఏమైనా చేసే ఓ వ్యక్తి కథను ఫ్యామిలీ స్టార్‌గా తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో తన అన్నలు, వదినలు, వాళ్ల పిల్లలు కోసం హీరో ఎలా కష్టపడ్డాడనేదే ఈ సినిమాలో చూపించాడు. కానీ హీరో క్యారెక్టర్‌ను మరి పేదరికంలో కాకుండా అప్పర్ మిడిల్ క్లాస్ అబ్బాయిగా చూపించాడు. ముఖ్యంగా కుటుంబం కష్టాల్లో ఉండటం వారిని ఎలా ఆదుకున్నాడనేది మరింత ఎమోషన్‌గా ప్రేక్షకుల గుండెలకు హత్తుకునేలా చూపించడంలో దర్శకుడు తడబడ్డాడు. మరోవైపు హీరోయిన్ థీసిస్ కోసం హీరో ఇంటినే ఎందుకు సెలెక్ట్ చేసుకుందనే పాయంట్ లాజిక్‌కు అందదు. హైదరాబాద్ సిటీలో ఇలాంటి ఫ్యామిలీ స్టార్స్ ఎందరో ఉన్నా.. ఎవరు లేనట్టు ఇతన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకుందనేది కూడా ఇంకాస్త కన్విన్స్‌గా చెబితే బాగుండేది. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం అక్కడక్కడ కొన్ని ఫైట్ సీన్స్ పెట్టారు. ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్‌తో ఎంగేజ్ చేసిన దర్శకుడు సెండాఫ్‌లో ఏం చెప్పాలో తెలియక తడబడ్డాడు. అక్కడ నుంచి స్టోరీ అమెరికాకు షిప్ట్ అవుతుంది. అక్కడ నాగార్జున 'మన్మథుడు' తరహా కథనం. ఇవన్నీ రెగ్యులర్‌గా సినిమా చూసే ఆడియన్స్‌కు బోర్ కొట్టిస్తాయి. మరోవైపు హీరో పెట్రోల్ బంకులో రూ. 23 పెట్రోల్ కొట్టించుకోవడం అనేది సిల్లిగా ఉంటుంది. మరోవైపు ఉల్లిగడ్డల కోసం మరి పరుగులు పెట్టే బాపతు కొంచెం అతిగా ఉంటుంది. అసలు మిడిల్ క్లాస్ అంటే .. హీరో కుటుంబం అద్దె ఇంట్లో ఉండటం.. ఆర్ధిక కష్టాలు వంటి ఇవివి తీసిన 'అమ్మో ఒకటో తారీఖు' తరహాలో కాకపోయినా.. ఇంకాస్త ఎమోషనల్‌గా ఈ సినిమాను తెరకెక్కించి ఉంటే సినిమా బెటర్‌గా ఉండేది. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో ఇలాంటి తరహా సినిమాలు రాకపోవడం.. పోటీలో మరో పెద్ద సినిమా లేకపోవడం వంటివి ఫ్యామిలీ స్టార్ సినిమాకు కలిసొచ్చే అంశాలు.
నటీనటుల విషయానికొస్తే..
నటుడిగా విజయ్ దేవకొండ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అతనిలోని యాక్టింగ్‌ను దర్శకుడు ఇంకాస్త పిండి ఉంటే బాగుండేది. నటుడిగా తన పరిధి మేరకు మెప్పించాడు. మృణాల్ ఠాకూర్ తన నటనతో ఆకట్టుకుంది. తన క్యారెక్టర్ మేరకు పలు సన్నివేశాల్లో ఎమోషన్ పండించింది. వెన్నెల కిషోర్ ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేసాడు. జగపతి బాబు, రవిబాబు తమ పరిధి మేరకు మెప్పించారు.
ప్లస్ పాయింట్స్
విజయ్ దేవరకొండ నటన
ఫస్ట్ హాఫ్
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
సెకండాఫ్ ల్యాగ్
ఎమోషన్ సీన్స్
చివరి మాట.. 'ది ఫ్యామిలీ స్టార్'.. ఓ మోస్తరుగా ఆకట్టుకునే ఫ్యామిలీ స్టార్..
రేటింగ్.. 2.75/5
Also Read: Kavitha Bail: ఎమ్మెల్సీ కవితపై ఈడీ సంచలన వ్యాఖ్యలు.. ఇక జైలు బయటకు రానట్టే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook