Sarath: టాలీవుడ్‌లో విషాదం.. డైరెక్టర్ శరత్ కన్నుమూత

కేన్సర్ తో భాదపడుతున్న ప్రముఖ దర్శకుడు శరత్ హైదరాబాద్ లోని ఒక ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవరంతెల్ల వారుజామున కన్ను మూశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2022, 12:31 PM IST
  • 'బావ బావమరిది' సినిమా డైరెక్టర్ మృతి
  • 20కి పైగా సినిమాలకి దర్శకత్వం వచించిన శరత్
  • సుమన్, బాలకృష్ణతో హిట్ సినిమాలు
Sarath: టాలీవుడ్‌లో విషాదం.. డైరెక్టర్ శరత్ కన్నుమూత

Director Sarath: టాలీవుడ్‌ ఇండస్ట్రీలో వరుస మరణాలు కలవరానికి గురి చేస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు శరత్ కన్నుమూత ఈ రోజు (శుక్రవరం) తెల్ల వారుజామున కన్ను మూశారు. గత కొంతకాలంగా కేన్సర్ తో భాదపడుతున్న ఆయన హైదరాబాద్ నగరంలోని ఒక ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 

తెలుగులో "చాదస్తపు మొగుడు" అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన డైరెక్టర్ శరత్ దాదాపు 20 సినిమాలకు దర్శకత్వం వహించటమే కాకుండా కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. అప్పటి స్టార్ హీరోస్ బాలకృష్ణ, సుమన్, జగపతి బాబు వంటి హీరోలతో పని చేశారు. 

హీరో సుమన్ తో చాదస్తపు మొగుడు, సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆయన అక్కినేని నాగేశ్వర్ రావు గారితో 'కాలేజీ బుల్లోడు', బాలకృష్ణతో సుల్తాన్, పెద్దన్నయ్య, వంశానికొక్కడు, జ‌గ‌ప‌తిబాబుతో 'భ‌లే బుల్లోడు', సినిమాలు తెరకెక్కించారు. హీరో  సుమన్ తో 'బావ బావమరిది', 'చిన్నల్లుడు','పెద్దింటి అల్లుడు' వంటి సినిమాలకు దర్శకత్వం వచించారు. డైరెక్టర్ శరత్ పెళ్లి చేసుకోలేదు, శరత్ మరణంపై పలువురు సినీ తారలు సంతాపం తెలుపుతున్నారు. 

Also Read: IPL 2022 Spectators: ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇక క్రికెట్ ఫ్యాన్స్ కు పండగే!

Also Read: Nitish Kumar Vice President: భారతదేశ తదుపరి ఉపరాష్ట్రపతిగా బిహార్ సీఎం నితీష్ కుమార్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News