Tollywood heroes Business: మహేష్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ.. ఇపుడు ఆ బిజినెస్‌లోకి రవితేజ..

Tollywood heroes Business: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు మన హీరోలు. అంతేకాదు ఫామ్‌లోనే ఉండగానే ఫ్యూచర్‌కు తగ్గ ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు. ఈ కోవలో ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండలు మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఈ రూట్లోనే మాస్ మహారాజ్ త్వరలో మల్లీప్లెక్స్‌ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 22, 2024, 09:13 AM IST
Tollywood heroes Business: మహేష్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ.. ఇపుడు ఆ బిజినెస్‌లోకి రవితేజ..

Tollywood heroes Business: మన హీరోలు ఈ మధ్య మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్‌ బాబు హైదరాబాద్‌ హైటెక్ సిటీలో AMB మల్టీప్లెక్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.ఈ మల్టీప్లెక్స్‌ను ఏషియన్ గ్రూపుతో కలిసి నిర్మించారు. ఇపుడీ థియేటర్‌లో సినిమా చూడటం అనేది మూవీ లవర్స్‌కు ఓ ప్యాషన్‌ అయిపోయింది. ఇక తెలుగులో అప్పట్లోనే అన్న ఎన్టీఆర్.. రామకృష్ణ, తారకరామ థియేటర్స్‌ బిజినెస్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా.

ఆ తర్వాత చాలా మంది హీరోలకు వాళ్లు సొంత ఊళ్లలో థియేటర్స్ ఉండటం కామన్ అయిపోయింది. అటు ఐకాన్ స్టార్ కూడా అమీర్ పేట్‌లో AAA సినిమాస్ అంటూ గ్రాండ్‌గా ఏషియన్ వాళ్లతో కలిసి ఈ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు. అటు బన్ని కంటే ముందే విజయ్ దేవరకొండ కూడా మహబూబ్ నగర్‌లో AVD అంటూ మల్టీప్లెక్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా.ఈ మల్టీప్లెక్స్‌లు అన్ని కూడా ఏషియన్ గ్రూపు ఆయా హీరోలతో కలిసి నిర్మించింది. అటు ప్రభాస్ కూడా నెల్లూరులో తన స్నేహితులతో కలిసి ఓ మల్టీప్లెక్స్ నిర్మించిన సంగతి తెలిసిందే కదా. అటు ఎన్టీఆర్ కూడా త్వరలో ఈ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

తాజాగా రవితేజ కూడా మల్టీప్లెక్స్‌లో బిజినెస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. హైదరాబాద్ దిల్‌సుఖ్ నగర్ ప్రాంతంలో ఏషియన్ గ్రూపతో కలిసి ఈ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. దీనికి రవితేజ పేరు కలిసొచ్చేలా.. ART ఏషియన్ రవితేజ పేరుతో స్టార్ట్ చేయనున్నారు. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడనుంది.

Also Read: Muddapappu, Egg: ఏపీ రాజకీయాల్లో 'ముద్దపప్పు, కోడిగుడ్డు' రచ్చ.. ప్రజలకు మస్త్‌ వినోదం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x