Balakrishna in Liger: 'లైగర్‌'లో బాలయ్య-అదిరిపోయే సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన పూరి...?

Balakrishna in Liger: లైగర్‌లో దర్శకుడు పూరి జగన్నాథ్ మరో సర్‌ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మైక్ టైసన్‌ ఎంట్రీతో ఈ సినిమాకు ఫుల్ క్రేజ్ ఏర్పడగా... తాజాగా ఈ సినిమాలో గెస్ట్ రోల్ కోసం బాలయ్యను ఒప్పించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2021, 01:15 PM IST
  • లైగర్‌ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
  • లైగర్ సినిమాలో బాలయ్య గెస్ట్ రోల్
  • ఇదే నిజమైతే అభిమానులకు పూనకాలే
Balakrishna in Liger: 'లైగర్‌'లో బాలయ్య-అదిరిపోయే సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన పూరి...?

Balakrishna in Liger: 'అఖండ' (Akhanda Movie) బ్లాక్‌బస్టర్‌తో జోరు మీదున్న నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నటిస్తున్న 'లైగర్' (Liger) సినిమాలో మెరవనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్‌లో బాలయ్యతో ఓ గెస్ట్ రోల్ ప్లాన్ చేశాడని... అందుకు బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనే టాక్ వినిపిస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్యతో పూరి ప్లాన్ చేసిన సర్‌ప్రైజ్ ఇండస్ట్రీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారింది.

బాలకృష్ణతో పూరి జగన్నాథ్ (Puri Jagannath) 'పైసా వసూల్' చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడనప్పటికీ... బాలయ్య క్యారెక్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. ఆ సినిమాలో బాలయ్య మాస్ క్యారెక్టర్ మాస్ అభిమానులకు బాగా కనెక్ట్ అయింది. అప్పటినుంచి పూరి-బాలకృష్ణ మధ్య అనుబంధం అలాగే కొనసాగుతోంది. ఆ సాన్నిహిత్యంతోనే పూరి బాలయ్యను (Nandamuri Balakrishna) గెస్ట్ రోల్ కోసం అడగడం... అందుకు ఆయన ఓకె చెప్పడం జరిగిపోయాయని అంటున్నారు. బాలయ్యతో పూరి పవర్‌ఫుల్ గెస్ట్ రోల్ చేయించే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే నిజమైతే థియేటర్‌లో ప్రేక్షకులకు డబుల్ డోస్ గ్యారెంటీ అనే చెప్పాలి. 

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న లైగర్ (Liger Movie) షూటింగ్ ఇప్పటికే చాలావరకు పూర్తయింది. ఇటీవలే లాస్ వెగాస్‌లో ఒక షెడ్యూల్ జరగ్గా... మరో షెడ్యూల్‌తో షూటింగ్ పార్ట్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఈ చివరి షెడ్యూల్‌లోనే బాలయ్య కూడా లైగర్‌ టీమ్‌తో చేరే అవకాశం ఉంది. ఈ సినిమాతో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ తొలిసారి ఇండియన్ స్క్రీన్‌పై కనిపించనున్న సంగతి తెలిసిందే. అటు మైక్ టైసన్, ఇటు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), గెస్ట్ రోల్‌లో బాలయ్య... ఈ క్రేజీ కాంబినేషన్‌తో థియేటర్ దద్దరిల్లిపోవడం ఖాయమని పూరి అభిమానులు అంటున్నారు. పూరి,ఛార్మి సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Allu Arjun: అల్లు అర్జున్‌ను సర్ ప్రైజ్ చేసిన స్టార్ హీరోయిన్..ఏం గిఫ్ట్ పంపిందో తెలుసా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News