Continuing Medical Education: ఆహార మార్పుల‌తో అద్భుత జీవ‌నం సాధ్య‌మే..

Continuing Medical Education: ఆదివారం 29వ ఇన్-పర్సన్ కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేష్‌ కార్యక్రమం ఘనంగా పూర్తయింది. ఇందులో భాగంగా ముఖ్యంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 15, 2024, 06:54 PM IST
  • హైద‌రాబాద్‌లో ఘ‌నంగా పాన్ ఇండియా 29వ సీఎంయి
    29వ ఇన్-పర్సన్ కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (CME)
    ఆధునిక రిసెర్చ్‌లు ప్ర‌జెంట్ చేసిన వైద్య నిపుణులు
Continuing Medical Education: ఆహార మార్పుల‌తో అద్భుత జీవ‌నం సాధ్య‌మే..

Continuing Medical Education: ఫిజీషియన్స్ అసోసియేషన్ ఫర్ న్యూట్రిషన్ (PAN) ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాదులోని బంజారాహిల్స్ హయాత్ ప్లేస్‌లో 29వ ఇన్-పర్సన్ కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (CME) కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్యక్రమం ఆహార పోషకాహార ప్రాధాన్యత, ముఖ్యంగా ప్లాంట్ బేస్డ్ డైయెట్స్ ద్వారా నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ (NCDs) నిర్వహణపై చర్చించడానికి వైద్య నిపుణులు, పోషకాహార నిపుణులను ఒక వేదికపైకి తెచ్చింది.

ఈ సదస్సులో డాక్టర్ హేమలత, మెడిక‌ల్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ర‌జీన ష‌హిన్, డాక్టర్ ప్రత్యుష నెరెళ్ల వంటి వైద్య నిపుణులు ప్ర‌జెంట్ చేసిన‌ ఆధునిక రిసెర్చ్ ఫ‌లితాలు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉన్నాయి. డాక్టర్ రాజేందర్ రామగిరి ఆధ్వర్యంలో డయాబెటిస్ రిమిషన్‌పై కేస్ ప్రెజెంటేషన్, జీవన శైలిలో మార్పులతో వ‌చ్చిన అద్భుత‌ ఫ‌లితాల‌ను వివ‌రించారు. IBD, శోగ్రెన్ సిండ్రోమ్ నుండి రిమిషన్ సాధించిన మూడు రోగుల కేస్ స్టడీ, పోషకాహారం ద్వారా సాధించిన ఫలితాలను తెలిపారు. 

డాక్టర్ సుందీప్ లక్టాకియా మోడరేట్ చేసిన ప్యానెల్ డిస్కషన్, వైద్య రంగంలో పోషకాహారం సమగ్రతపై చర్చించారు. డాక్టర్ హేమలత ప్రసంగంలో నిరోధక ఆరోగ్యం, వ్యాధి నిర్వహణలో పోషకాహారం ప్రాధాన్యతను హైలైట్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌వారు ఒకరితో ఒకరు కొత్త ఆలోచనలను పంచుకున్నారు. పోషకాహారంపై దృష్టి సారించడం ద్వారా ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడంలో PAN ఇండియా తన కట్టుబాటును మరింత బలోపేతం చేసింది. ఈ CME ప్రోగ్రామ్ PAN ఇండియా లక్ష్యమైన ఆహార సంబంధ వ్యాధులను నివారించి, పర్యావరణ అనుకూల ఆరోగ్య పరిష్కారాలను ప్రోత్సహించే దిశగా మరొక మైలురాయిగా నిలిచింది.

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News