Niharika Konidela Wedding Card: నిహారిక కొణిదెల వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ చూశారా!

Niharika Konidela Wedding Card | మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, నటి నిహారిక కొణిదెల వివాహానికి అన్ని ఏర్పాట్లు చకాచకా జరిగిపోతున్నాయి. మెగా డాటర్ నిహారిక వివాహం గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో ఇదివరకే నిశ్చయమైందని తెలిసిందే.

Last Updated : Dec 2, 2020, 10:23 AM IST
Niharika Konidela Wedding Card: నిహారిక కొణిదెల వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ చూశారా!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో అప్పుడే పెళ్లి సందడి మొదలైంది. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, నటి నిహారిక కొణిదెల వివాహానికి అన్ని ఏర్పాట్లు చకాచకా జరిగిపోతున్నాయి. మెగా డాటర్ నిహారిక వివాహం గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో ఇదివరకే నిశ్చయమైందని తెలిసిందే. లాక్‌డౌన్ సమయంలో వెంకట చైతన్య, నిహారికల నిశ్చితార్థ వేడుకను సైతం ఇరు కుటుంబసభ్యులు జరిపారు.

తాజాగా నిహారిక పెళ్లిపై అప్‌డేట్ (Niharika Konidela Wedding Card) వచ్చేసింది. మెగా డాటర్ నిహారిక వివాహ ఆహ్వాన పత్రిక అని ఆమె వెడ్డింగ్ కార్డ్ ఫొటోలు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. రాజస్థాన్‌లో నిహారిక (Niharika Konidela), వెంకట చైతన్యల డెస్టినేషన్ వెడ్డింగ్‌కు కుటుంబసభ్యులు ప్లాన్ చేశారు. ఉదయ్‌పూర్‌లో డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథున లగ్నంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో టాలీవుడ్ నటి నిహారిక, చైతన్యల వివాహం జరగనుందని తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

Photos: Pooja Bhalekar Photos: RGV హీరోయిన్ పూజా భలేకర్ ఫొటోస్ ట్రెండింగ్

తండ్రి నాగబాబు, సోదరుడు వరుణ్ తేజ్ సహా కుటుంబపెద్దలు నిహారిక వివాహ కార్యక్రమానికి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాగా, డిసెంబర్ 11న హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో నిహారిక వెడ్డింగ్ రిసెప్షన్‌కు ప్లాన్ చేశారు. ఈ ఏడాది చివరికల్లా నిహారిక వివాహాన్ని జరిపిస్తానని గతంలో నాగబాబు చెప్పినట్లుగా వేడుక జరిపిస్తున్నారు.

Also Read : Voting Numbers of Bigg Boss 4 Contestants: ఓటింగ్ నెంబర్స్ ఇవే.. మిస్డ్ కాల్స్‌తో కంటెస్టెంట్‌ను సేవ్ చేయవచ్చు

Niharika Konidela Wedding Invitation Card (Photo: Social Media)

కాగా, టాలీవుడ్‌లో నిర్మాత దిల్ రాజు, హీరోలు నితిన్, నిఖిల్ సిద్ధార్థ్, రానా దగ్గుబాటి, పలువురు సెలబ్రిటీలు పెళ్లిపీటలు ఎక్కారు. తాజాగా మెగా ఫ్యామిలీలో సైతం పెళ్లిబాజాలు మోగనున్నాయి. నిహరిక, చైతన్యల డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసి.. కోవిడ్19 నిబంధనలతో శుభకార్యం నిర్వహించనున్నట్లు సమాచారం. 

Also Read : Motor Vehicle New Rules: వాహనదారులు తెలుసుకోవాల్సిన కొత్త రూల్స్ ఇవే!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News