మారి 2 తెలుగు ట్రైలర్ : నేను ఎదవలకే ఎదవను రా !

మారి 2 తెలుగు ట్రైలర్ : నేను ఎదవలకే ఎదవను రా !  

Last Updated : Dec 11, 2018, 10:01 PM IST
మారి 2 తెలుగు ట్రైలర్ : నేను ఎదవలకే ఎదవను రా !

ధనుష్ హీరోగా నటించిన మారి సినిమా గతంలో తమిళనాట రికార్డులు సృష్టించిన నేపథ్యంలో తాజాగా మేకర్స్ మరోసారి మారి సినిమాకు సీక్వెల్‌గా మారి 2ను ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వండర్ బార్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాను బాలాజీ మోహన్ డైరెక్ట్ చేయగా ధనుష్ సరసన సాయి పల్లవి జంటగా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్ మరో ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా తెలుగు ట్రైలర్ ఇవాళే విడుదలైంది. ఆకట్టుకునే డైలాగ్స్‌తో ఈ సినిమాలో ధనుష్ పాత్ర తీరు తెన్నులను వివరించేలా ఈ ట్రైలర్‌ను ఎడిట్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. మారి 2 ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి. 

Trending News