డబ్‌స్మాష్‌లతో సంచలనం సృష్టించిన 'మై డియర్ మచ్చా' తెలుగు సాంగ్

మై డియర్ మచ్చా పాటకు తెలుగు వెర్షన్ సాంగ్ ప్రోమో విడుదల

Last Updated : Dec 16, 2018, 06:38 PM IST
డబ్‌స్మాష్‌లతో సంచలనం సృష్టించిన 'మై డియర్ మచ్చా' తెలుగు సాంగ్

''మై డియర్ మచ్చా..'' అంటూ డబ్‌స్మాష్ వీడియోలతో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోన్న తమిళ పాటకు సంబంధించిన తెలుగు వెర్షన్ సాంగ్‌ను విడుదల చేశారు. బాలాజీ మోహన్ డైరెక్ట్ చేస్తోన్న మారి 2 సినిమా కోసం ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా కంపోజిషన్‌లో స్వయంగా ధనుష్, ఎంఎం మానసి పాడిన ఈ పాట తమిళంలో సినిమా విడుదలకు ముందే సూపర్ హిట్ అయ్యింది. మై డియర్ మచ్చా అనే లైన్‌కి చాలా మంది ఇప్పటికే తమ డబ్‌స్మాష్ వీడియోలను సైతం రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ పాటకు తెలుగులో ఎలాంటి స్పందన కనిపించనుందో తెలియాలంటే ఈ పాటపై ఓ లుక్కేయాల్సిందే.

 

Trending News