హాట్ కామెంట్లకు పడిపోయే రకం కాను: నటి

తమను తాము గ్లామర్‌గా చూపించుకునేందుకు మేకప్ వేసుకుంటారు. కొందరైతే సర్జరీలను ఆశ్రయిస్తారు. తనకు మాత్రం ఇలాంటివి అంతగా నచ్చవంటోంది Nia Sharma.

Last Updated : Apr 20, 2020, 03:49 PM IST
హాట్ కామెంట్లకు పడిపోయే రకం కాను: నటి

సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. స్వేచ్ఛ ఎక్కువ, పేరు, ప్రఖ్యాతులు, డబ్బు అధికంగానే సంపాదించుకోవచ్చు. నటీమణులది ప్రత్యేక స్థానం. తమను తాము గ్లామర్‌గా చూపించుకునేందుకు మేకప్ కోసం శ్రమిస్తారు. కొందరైతే ఏకంగా సర్జరీలను ఆశ్రయిస్తారు. ఇలాంటివి తనకు మాత్రం అంతగా పడవని అంటోంది నటి నియా శర్మ. బుల్లితెరపైనే కాదు ఆసియాలోని అందెగత్తెల జాబితాలో గత కొన్నేళ్లుగా ఆమె చోటు దక్కించుకుంటుంది. అయితే హాట్‌గా ఉన్నావ్ అని ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తే తనకు అంతగా ఇష్టం ఉండదంటోంది. చంద్రబాబుకు సీఎం జగన్ బర్త్ డే విషెస్.. ఈసారి ప్రత్యేకం!

తాగాజా పింక్ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. ఎవరైనా నువ్వు చాలా హాట్‌గా ఉన్నావ్, అందంగా ఉన్నావ్ అని కాంప్లిమెంట్ ఇస్తే ఓ చెవిలో విని మరో చెవి నుంచి వదిలేస్తాను. ఇలాంటి కాంప్లిమెంట్లను ఇంటివరకు కూడా మోసుకెళ్లనని చెబుతోంది నియా శర్మ. నా కష్టం, నా జీవిత ప్రయాణం ఏంటన్నది నాకు బాగా తెలుసు. హాట్‌గా ఉన్నావనే కాంప్లిమెంట్ తీసుకోవడానికి కూడా ఇష్టపడను. నేను చాలా నిజయితీగా ఉంటాను.  Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

నువ్వు చాలా మంచిదానివి, నీకు సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. చాలా చాలా సరదా మనిషివని ఎవరైనా కితాబిస్తే చాలు సంతోషిస్తాను. లేక నన్ను ఎవరైనా నా విధానాల్ని ఫాలో అయితే ముచ్చటగా ఉంటుంది. అందంగా ఉన్నాని చెప్పి ఏ క్యారెక్టర్ పడితే అది ఒప్పుకునే రకం కాదు. తొలుత స్క్రీన్ టెస్ట్ చేయించుకుని ఒకే అంటేనే ప్రాజెక్టును ఒప్పుకుంటా. బుల్లితెర మీద దశాబ్దకాలం నుంచి రాణిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నియా శర్మ తన మనసులో మాటల్ని ఇలా షేర్ చేసుకుంది.  శుభవార్త.. మీ PF రెట్టింపు అవుతుంది!

అందం కంటే క్యారెక్టర్‌కు ప్రాధాన్యమిస్తానని, వ్యక్తిగత స్వభావాన్ని నచ్చి ప్రశంసిస్తే అధికంగా సంతోషిస్తానని సెక్సీ భామ చెప్పడం అభినందనీయమే. ప్రస్తుతం ఫేమస్ సీరియల్ నాగిన్ 4లో కీలకపాత్ర పోషిస్తోంది నియా శర్మ.     ఏపీలో దారుణం: లాఠీ దెబ్బలకు యువకుడి మృతి!  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos 

Trending News