Excess Salt Side Effects: మనం ప్రతిరోజు వంటల్లో ఉప్పును ఉపయోగిస్తాము. ఉప్పులేకుండా ఆహారం రుచికరంగా తయారు కాదు. ఉప్పు తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. అయోడిన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల నష్టాలు కలుగుతాయి. ఆహారంలో ఉప్పు ఎక్కువగా తినడం వల్ల ఎలాంటి లక్షణాలు, నష్టాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకుందాం.
మనలో చాలా మంది కూరలో ఉప్పు వేసుకున్న మళ్లీ ఎక్కువగా ఉప్పు కలుపుకొని తింటారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. అయితే ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల మనలో కలిగే లక్షణాలు ఏంటో తెలుసుకుందాం.
ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. దీని వల్ల హైపర్ టెన్షన్ అని కూడా పిలుస్తారు. ఈ హైపర్ టెన్షన్ వల్ల గుండె సంబంధిత సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. అంతేకాకుండా కిడ్నీలపైన అధిక ఒత్తిడి కలిగే అవకాశం ఉంటుంది. సోడియం లెవల్స్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీలపైన ఒత్తిడి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల కిడ్నీల్ల రాళ్లు వచ్చే ఛాన్స్‌లు ఎక్కువగా ఉంటాయి.
ఉప్పును అధికంగా తినడం వల్ల జీర్ణ సమస్యలు కూడా కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఆహారంలో ఉప్పును ఎక్కువగా కలుపుకొని తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరంగా ఉంటుంది. దీని వల్ల ఆహారం తీసుకోవాలి అనే భావన తగ్గుతుంది. ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.
వేసవిలో ఉప్పును తక్కువగా తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్యలు కలుగుతాయి. శరీరంలో ఉండే నీరు మొత్తం చెమట రూపంలో బయటకు తొలుగుతుంది. దీంతో దాహం ఎక్కువగా కలుగుతుంది. శరీరానికి కావాల్సిన ఉప్పును మాత్రమే తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు ఉప్పు పట్ల ఎంతో శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే శరీంరలో ఇన్సులిన్ లెవల్స్, గ్లూకోజ్ లెవల్స్ దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఉప్పును రెండు గ్రాముల కంటే ఎక్కువా తీసుకోవద్దని పరిశోధకులు చెబుతున్నారు. ఒక వేల అధికంగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుందని సూచిస్తున్నారు.
ఉప్పుతో ఇలా చేయవచ్చు:
గొంతు శుభ్రం చేయడంలో ఉప్పు ఎంతో ఉపయోగపడుతుంది. దీని కోసం మీరు ఉదయం ఒక గ్లాస్ నీటిలో చెంచా ఉప్పు కలుపుకొని పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల గొంతు గరగరగా తొలుగుతుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి