Alcoholic Drinks Food Items: ప్రస్తుతం బాధ వచ్చినా.. సంతోషం కలిగినా.. ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగినా మధ్యలో మద్యం ఉండాల్సిందే. డైలీ మద్యం సేవించే వారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వేడుకలు, ఫంక్షన్లలలో అయితే లిక్కర్ లేకపోతే ఆ అసలు పార్టీ జరగనట్లే ఉండదు. అయితే చాలామంది ఆల్కాహాల్ సేవించే సమయంలో స్టఫ్‌గా ఏది పడితే అది తీసుకుంటారు. కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో హానీకరంగా మారే అవకాశం కూడా ఉంటుంది. మద్యం సేవించేటప్పుడు స్టఫ్‌గా ఏ ఆహారం తీసుకోవాలి..? ఏది తీసుకోకూడదు..? పూర్తి వివరాలు ఇలా..
మద్యం సేవించే సమయంలో వీటిని తినండి..
==> డ్రై ఫ్రూట్స్: ఆల్కహాల్‌తో పాటు డ్రై ఫ్రూట్స్ తీసుకునేందుకు చాలా మంది ఇష్టపడతారు. డ్రై ఫ్రూట్స్‌లో ఉండే అధిక కొవ్వు పదార్థంతో ఆల్కహాల్‌లో శోషణ తగ్గిపోతుంది.
==> యాపిల్ లేదా ఇతర పండ్లు: పండ్లలో నీటి పరిమాణం ఎక్కువగా ఉంటుంది. మద్యం సేవించే సమయంలో పండ్లను తింటే ఆల్కహాల్ ప్రభావం తగ్గుతుంది. యాపిల్ తింటే ఆల్కహాల్ వల్ల కలిగే పేగులలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.
==> గుడ్లు: గుడ్లలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆల్కహాల్ శోషణను నెమ్మదిస్తాయి.
==> సాల్మన్: సాల్మన్ చేపలు ఒమేగా-3 ఫ్యాటీలో యాసిడ్స్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఆల్కహాల్ తాగే సమయంలో వీటిని తినడం వల్ల మెదడు వాపును తగ్గించడానికి పనిచేస్తాయి.
ఈ ఆహారం అస్సలు తీసుకోవద్దు..
==> పాల ఉత్పత్తులు: మద్యం తాగేటప్పుడు కెఫిన్, చాక్లెట్ లేదా కోకోకు దూరంగా ఉండాలి. ఇందులో ఉండే ఇతర ఆమ్ల ఆహార పదార్థాల జీర్ణక్రియ సమస్యలను పెంచుతాయి.
==> పిజ్జా: ఆల్కాహాల్ సేవించే సమయంలో పిజ్జా తినేందుకు చాలామంది ఇష్టపడతారు. అయితే ఈ రెండు పదార్థాలను ఎప్పుడూ కలిపి తినకూడదు. మద్యం తాగుతూ పిజ్జా తింటే తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది.
==> సాల్టీ ఫుడ్: నాచోస్ లేదా ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి సాల్టీ ఫుడ్ ఐటమ్స్‌ను మద్యం సేవించే సమయంలో తీసుకోకూడదు. ఇందులో సోడియం చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
==> బీన్స్: ఆల్కహాల్ సేవించే సమయంలో బీన్స్, పప్పులు తినకూడదు. వీటిలో ఐరన్ ఉంటుంది. వీటిని శరీరం బాగా జీర్ణించుకోలేదు.
ముఖ్యగమనిక: ఇక్కడ ఇచ్చిన సలహాలు, సూచనలు పాటించే ముందు వైద్యులు లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.
Also Read: Bandi Sanjay: మాటలు కోటలు దాటుతాయ్.. ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు: బండి సంజయ్
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంపుతోపాటు ఈ బెనిఫిట్స్ అమలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook