Health Tips: మధుమేహం అనేది సాధారణంగా చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా తలెత్తుతుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. మధుమేహం నుంచి కాపాడుకోవాలంటే..హెల్తీ ఫుడ్ అండ్ హెల్తీ లైఫ్‌స్టైల్ అవసరం. మధుమేహం ప్రమాదకరంగా మారే 10 పద్దతులున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
డయాబెటిస్ వ్యాధిగ్రస్థుల్లో గుండెపోటు, స్ట్రోక్, ధమనుల సమస్య ముప్పు ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు అనేది రక్త వాహికలకు హాని కల్గిస్తుంది. ధమనుల్ని తగ్గిస్తుంది. రక్త సరఫరాలో ఆటంకం కల్గిస్తుంది. దీర్ఘకాలం అదిక రక్తపోటు ఉంటే..నాళికలు దెబ్బతింటాయి. ఫలితంగా నొప్పి, తిమ్మిరి పట్టినట్టుండటం వంటి లక్షణాలు కన్పిస్తాయి. చేతులు, కాళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉండవచ్చు. దీనినే డయాబెటిస్ న్యూరోపతి అంటారు.
మధుమేహం అనేది కిడ్నీ వ్యాధికి ప్రధాన కారణమౌతుంది. అధిక బ్లడ్ షుగర్ అనేది కిడ్నీలోని రక్త వాహికలకు హాని కల్గిస్తుంది. శరీరంలోని అవశేష, వ్యర్ద, విష పదార్ధాలను ఫిల్టర్ చేసి తొలగించే సామర్ద్యం తగ్గిపోతుంది. దీర్ఘకాలంగా కిడ్నీ సమస్య ఉన్నవారికి మరింత ఇబ్బంది కల్గిస్తుంది. ఫలితంగా డయాలసిస్ కు దారి తీయవచ్చు. ఈ స్థితిని నెఫ్రోపతిగా పిలుస్తారు.
మధుమేహం రెటీనాలోని రక్త వాహికలను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా రెటినోపతి అనే సమస్య ఉత్పన్నమౌతుంది. ఇది కంటి వెలుగుపై దుష్ప్రభావం చూపిస్తుంది. విజన్ తగ్గవచ్చు. తక్షణం చికిత్స లేకపోతే పరిస్థితి తీవ్రమై కంటి చూపు పోవచ్చు. అందుకే ఈ స్థితిలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్యులు.
డయాబెటిస్ వ్యాధిగ్రస్థుల్లో కాళ్లలో రక్త ప్రసరణ సరిగ్గా జరగక వివిధ రకాల సమస్యలు ఏర్పడవచ్చు. అల్సర్, సంక్రమణ, గాయం త్వరగా మానకపోవడం వంటి పరిస్థితి ఉంటుంది. ఇంకొన్ని కేసుల్లో ఏకంగా కాలికి రంద్రాలు కూడా పడవచ్చు.
మధుమేహం నియంత్రణలో లేకుండా ఎక్కువ కాలం కొనసాగితే పలు ఇతర సమస్యలు రావచ్చు. ఇందులో చర్మం నిర్జీవం కావడం, ఫంగల్, దురద, గాయం త్వరగా మానకపోవడం, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ వంటివి కలుగుతాయి.
మధుమేహ వ్యాధిగ్రస్థుల్లో రోగ నిరోధకత తగ్గుతుంది. ఫలితంగా అంటువ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న రోగాలు కూడా త్వరగా సోకుతుంటాయి. శరీరం అంటువ్యాధులతో పోరాడే శక్తిని కోల్పోతుంది.
మధుమేహం నియంత్రణలో లేకుండా ఎక్కువకాలం ఉంటే నోటి సమస్యలకు దారితీస్తుంది. పంటి చిగుళ్లు రక్తం కారడం, బలహీనమవడం, పంటి సమస్య వంటివి ఏర్పడతాయి. నోటిలో బ్యాక్టీరియా వేగంగా వృద్ది చెందుతుంది. అందుకే మధుమేహం వ్యాధి సోకినప్పుడు ఎప్పటికప్పుుడు పరీక్ష చేయించుకోవడం ద్వారా అప్రమత్తంగా ఉండాలి. ఆహారపు అలవాట్లు , జీవనశైలి మార్చుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుండాలి. ఈ జాగ్రత్తలు తీసుకోనప్పుుడు పైన ఉదహరించిన తీవ్ర సమస్యలకు దారితీస్తుంది.
Also read: Diabetes Control Tips: మధుమేహం ఉన్నవారు తీపి పదార్థాలను కూడా తినొచ్చు! నమ్మట్లేదా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook