మెడనొప్పి సమస్య ఇటీవలికాలంలో అధికంగా కన్పిస్తోంది. పని ఒత్తిడి, వ్యాయామం లేకపోవడమే ఇందుకు కారణం. మెడనొప్పి ఉంటే కనీసం కూర్చోవడానికి కూడా అసౌకర్యంగా ఉంటుంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు..
ఆధునిక జీవనశైలిలో వివిధ రకాల ఒత్తిళ్లు, పని తీరు కారణంగా మెడనొప్పి సమస్యగా అధికంగా కన్పిస్తోంది. మెడనొప్పి సమస్య ఉన్నప్పుడు ఏ పనీ చేయలేని పరిస్థితి ఉంటుంది. పూర్తి అసౌకర్యంగా ఉండి..కనీసం ఎవరితోనూ మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. మెడ కండరాలు పట్టేస్తుంటాయి. ఫలితంగా నొప్పి ఉంటుంది. సరిగ్గా పడుకోకపోవడం, తలగడ లేదా బెడ్ సరిగ్గా లేకపోవడం వంటి కారణాలతోనే సహజంగా మెడ నొప్పి సమస్య ఉంటుంది. మందులతో కూడా వెంటనే ఉపశమనం లభించదు. అయితే కొన్ని సులభమైన చిట్కాలతో మెడనొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
వేడినీటితో కాపరం
నొప్పి తగ్గించేందుకు కాపరం పెట్టడం అనేది చాలా మంచి ప్రక్రియ. నొప్పి ఉన్నప్పుడు హాట్ వాటర్ బ్యాగ్‌తో మెడకు కాపరం పడితే మంచి ఫలితాలుంటాయి. ఇలా చేయడం వల్ల మెడ కండరాలు, నరాలపై ఒత్తిడి తగ్గి..విశ్రాంతి లభిస్తుంది. కాపరం పట్టడం వల్ల కాస్సేపట్లోనే ఉపశమనం కలుగుతుంది.
ఆయిల్ మస్సాజ్
ఆయిల్ మస్సాజ్ చేయడం వల్ల తక్షణం ఉపశమనం లభిస్తుంది. మెడలో నొప్పి ఉన్నప్పుడు ఆవనూనె వేడి చేసి మస్సాజ్ చేస్తే మంచి ఫలితాలుంటాయి. ల్యావెండర్ నూనెతో మస్సాజ్ చేసినా నొప్పులు చాలావరకూ తగ్గుతాయి.
యోగాతో లాభాలు
యోగా చేయడం వల్ల మెడనొప్పిని దూరం చేయవచ్చు. కొన్ని ప్రత్యేకమైన యోగా పద్ధతులతో మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. యోగాతో బ్లడ్ సర్కులేషన్ మెరుగుపడుతుంది. దీంతో కండరాలు పట్టడం ఉండదు. నొప్పి తగ్గుతుంది. మెడను ఎప్ప్పుడు బలవంతంగా తిప్పడం చేయకూడదు.
అల్లం, తేనెతో లాభాలు
అల్లం, తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నొప్పిని దూరం చేయడంలో దోహదపడతాయి. అల్లం, తేనె కలిపి తీసుకోవడం వల్ల మెడ నొప్పి చాలా వరకూ తగ్గుతుంది.
పింక్ సాల్ట్‌తో కాపరం
పింక్ సాల్ట్‌ను నీళ్లలో కలిపి కాపరం పడితే నొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. గోరు వెచ్చని నీళ్లలో పింక్ సాల్ట్ మిక్స్ చేసి కాపరం పట్టాలి. దీనివల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. నొప్పి దూరమౌతుంది.
Also read: Coriander Leaf: కొత్తిమీరతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. తెలిస్తే అస్సలు వదలరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook