Monsoon: వర్షాకాలం క్రమంగా తీవ్రత చూపిస్తోంది. భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్ని అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాకాలంలో చాలా రకాల వ్యాధులు చుట్టుముట్టేస్తుంటాయి. సీజన్ మారడంతో సహజంగానే ఇమ్యూనిటీ బలహీనమౌతుంది. ఈ క్రమంలో వర్షాకాలం వ్యాధుల్నించి సంరక్షించుకునేందుకు ఏం చేయాలి, ఎలాంటి పదార్ధాలు తీసుకోవాలో తెలుసుకుందాం..
వర్షాకాలంలో సహజంగానే వివిధ రకాల వ్యాధుల భయం ఉంటుంది. సీజన్ మారడంతో ఇన్‌ఫెక్షన్లు సోకుతుంటాయి. చాలా వ్యాధుల సమస్య ఉత్పన్నమౌతుంటుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు తీవ్రమౌతుంటాయి. ఈ సమస్యల్నించి రక్షించుకోవాలంటే ముందుగా ఇమ్యూనిటీ పటిష్టపర్చుకోవాలి. ఇమ్యూనిటీ బలంగా ఉంటే ఏ విధమైన అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావు. శరీరంలో నిరోధక శక్తి పెరగాలంటే..కొన్ని మసాలా పదార్ధాలను డైట్‌లో తప్పకుండా చేర్చుకోవాలి. ఇమ్యూనిటీని పెంచేందుకు ఏం చేయాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం..
ఇమ్యూనిటీని పెంచేందుకు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటుంది. ఇమ్యూనిటీ పటిష్టం చేసేందుకు నల్లమిరియాలు అద్భుతంగా ఉపయోగపడతాయని వివిధ ఆయుర్వేద శాస్త్రాల్లో ఉంది. నల్లమిరియాలు రోజూ క్రమం తప్పకుండా తీసుకునే అలవాటుంటే మెటబోలిజం వృద్ధి చెందుతుంది. దగ్గు లేదా గొంతులో గరగర సమస్య ఉంటే నల్లమిరియాలు బాగా ఉపయోగపడతాయి. అటు ఇమ్యూనిటీ కూడా బలపడుతుంది. రోజూ రాత్రి వేళ నిద్రించేముందు నల్ల మిరియాల పౌడర్ కలిపిన పాలు తాగడం మంచి అలవాటుగా చెప్పవచ్చు.
ఇమ్యూనిటీని పెంచేందుకు కావల్సిన మరో పదార్ధం లవంగం. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవి ఇమ్యూనిటీని పటిష్టం చేస్తాయి. వర్షకాలంలో రోజూ లవంగం వివిధ పదార్ధాలతో కలిపి తీసుకోవడం అలవాటు చేసుకుంటే గొంతులో గరగర వంటి సమస్య ఉండదు. ఇమ్యూనిటీ కూడా పటిష్టమౌతుంది.
మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే మరో పదార్ధం పసుపు. పసుపు ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండేదే. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. శరీరాన్ని వివిథ రకాల వ్యాధుల్నించి రక్షిస్తాయి. రోజూ రాత్రి వేళ పసుపు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది.
Also read: Heart Health: మీ గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఏం చేయాలి, ఎలా ఉండాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook