Sex and Covid19: కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవాలంటే కోవిడ్ ప్రోటోకాల్ కచ్చితంగా పాటించాల్సిందే. ఇది అందరికీ తెలిసిన విషయం. బలవర్ధకమైన ఆహారమూ అవసరమే. ఇది కూడా తెలిసిన సంగతే. దీంతో పాటు ఆ పని తప్పకుండా చేయాలంటున్నారు వైద్య నిపుణులు. అదేంటో తెలుసా..
సెక్స్ గురించి చాలా మంది చాలా రకాలుగా చెబుతుంటారు.సెక్స్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ లైఫ్ అనీ..సెక్స్ ఈజ్ ద ఎంజాయ్‌మెంట్ అనీ..సెక్స్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అనీ. ఇలా ఒక్కొక్కరి వాదన ఒక్కోలా ఉంటుంది. అయితే ఏది నిజం ఏది కాదో తెలుసుకునే ముందు సెక్స్ గురించి వైద్య నిపుణులు చెబుతున్న విషయాలు చాలా ఆసక్తి రేపుతున్నాయి. కరోనా మహమ్మారి నియంత్రణలో సెక్స్ కీలకపాత్ర పోషిస్తుందనేది తాజా అధ్యయనం చెబుతున్న వివరాలు.
ఇప్పటి వరకూ మనకు కోవిడ్ ప్రోటోకాల్ అంటే ముఖానికి మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం, రోగ నిరోధక శక్తి పెంచుకోవడం, వ్యాక్సినేషన్ ఇవే ఆచరిస్తూ వస్తున్నాం. ఇక నుంచి సెక్స్‌ను పార్ట్ ఆఫ్ ద లైఫ్‌గానే కాకుండా సెక్స్‌ను ముఖ్యమైన విషయంగా మార్చుకోవల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు. కరోనా నియంత్రణకు సెక్స్ కూడా అవసరమే అంటున్నారు. అదెలాగా తెలుసుకుందాం.
ఈ ఆసక్తి కల్గించే అంశాల్ని అమెరికా ఆరిజోనాలో ఉన్న డాక్టర్ ఫెయిత్ చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనీ విషయాల్ని వెల్లడించారు. టిక్ టాక్‌లో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ వైద్యునికి ఏకంగా 6.5 లక్షలమంది ఫాలోవర్లున్నారు. సెక్స్‌కు కరోనా నియంత్రణకు ఉన్న లాజికల్ సంబంధాన్ని లైవ్ ద్వారా వివరించారు.
వారంలో కనీసం రెండు సార్లు సెక్స్‌లో పాల్గొంటే..రోగ నిరోధక శక్తి (Immunity Power)పెరుగుతుందని డాక్టర్ ఫెయిత్ వివరించారు. ఎందుకంటే భావ ప్రాప్తితో అనారోగ్యం దరిచేరదనేది ఆయన విశ్లేషణ. వారంలో కనీసం రెండు సార్లు సెక్స్‌లో(Sex During covid time)పాల్గొంటే..రోగ నిరోధక వ్యవస్థ 30 శాతం మెరుగుపడుతుందట.సెక్స్ కారణంగా ఇమ్యూనిటీ పెరుగుతుందనే విషయం కొత్తది కాదు. గతంలో చాలా మెడికల్ జర్నల్స్‌లో ప్రచురితమైంది. చాలా మంది వైద్యులు చెప్పారు కూడా. అయితే కరోనా మహమ్మారి నియంత్రణలో సెక్స్ కీలకమని డాక్టర్ ఫెయిత్ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
ఆరోగ్యకరమైన శృంగారంతో శరీరంలోని ఇమ్యూనోగ్లోబిన్-ఎ లెవల్స్ కచ్చితంగా పెరుగుతాయని 2004లో జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. శృంగారమనేది యాంటీబాడీలా పని చేస్తుందని..ఫలితంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆ అధ్యయనం వెల్లడించింది. భావ సెక్స్‌లో పాల్గొన్నప్పుడు కలిగే భావ ప్రాప్తితో మనిషి శరీరంలో ఉన్న రసాయనాలు, హార్మోన్లు యాక్టివేట్ అవుతాయి. ఫలితంగా రక్త ప్రసరణ మెరుగుపడి..రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు ఏ విధంగా యాంటీబాడీలు పెరిగి..వైరస్‌పై పోరాడుతాయో..అదే విధంగా సెక్స్‌లో పాల్గొన్నప్పుడు యాంటీబాడీలు(Antibodies)పెరిగి..వైరస్ నుంచి రక్షణ కల్పిస్తాయి.
Also read: Healthy Skin Tips: చలికాలపు చర్మ సమస్యలకు ఇలా చెక్ పెట్టవచ్చు..లేకపోతే ప్రమాదమే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook