How To Relieve Joint Pain: ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా 7 రోజుల్లో కీళ్ల నొప్పులకు చెక్..

How To Relieve Joint Pain In 7 Days:  కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడే వారు తప్పకుండా వారు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒత్తిడి గురవకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా పోషకాలున్న ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 16, 2022, 03:41 PM IST
  • కాల్షియం, విటమిన్ డి ఆహారాలు,
  • వ్యాయామాలు చేయడం వల్ల కేవలం 7
  • రోజుల్లో కీళ్ల నొప్పులు తగ్గింతాయి.
How To Relieve Joint Pain: ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా 7 రోజుల్లో కీళ్ల నొప్పులకు చెక్..

How To Relieve Joint Pain In 7 Days: వాతావరణంలో వివిధ రకాల మార్పుల కారణంగా వ్యాధుల తీవ్రత కూడా పెరుగుతోంది. అంతేకాకుండా చాలా మంది ప్రమాదకరమైన వ్యాధుల బారిన కూడా పడుతున్నారు. అయితే చాలా మంది ప్రస్తుతం వివిధ కారణాల వల్ల  కీళ్ల నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు. పూర్వం వృద్ధులు, మహిళలు ఎక్కువగా ఈ సమస్యతో బాధపడేవారు. అయితే ఆధునిక జీవన శైలి కారణంగా యువత కూడా ఇలాంటి సమస్యలతో గురవుతున్నారు. వాతావరణం మారినప్పుడల్లా కీళ్ల నొప్పుల సమస్య పెరుగుతున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి ఎలా బయట పడాలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..

కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి?:
ఒత్తిడి లేదా కీళ్లకు వివిధ రకాల గాయాలు కావడం వల్ల తరచుగా కీళ్లలో నొప్పులు వస్తున్నాయని ఆయుర్వేద వైద్యులు మోకాళ్లు నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం చాలా మంది ఏదో ఒక కారణంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఎంత తొందరగా ఉపశమనం పొందితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

కీళ్ల నొప్పులకు కారణం:
ఆర్థరైటిస్ సమస్య కారణంగా మోకాళ్లలో, కీళ్లలో వాపు వస్తున్నాయి. దీని వల్ల కీళ్లలో నొప్పులు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా కీళ్లలో దృఢత్వం తగ్గి పోయి. వివిధ రకాల వ్యాధులకు కూడా గురవుతున్నారు. కాబట్టి ఒక్క సారి కీళ్ల నొప్పులకు గురవుతే పలు రకాల జాగ్రత్తలు వహించడం చాలా మంచిది.

కీళ్ల నొప్పుల నివారణలు:

యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఆహారాలు:
కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. దీని కోసం మీరు ఆలివ్ నూనె, పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా శరానికి పోషకాలు ఇచ్చే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.

వ్యాయామాలు:
కీళ్ల నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుంగా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.  క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తే ఈ సమస్యల నుంచి ఉపశమనం లభించడమేకాకుండా శరీరం ఫిట్‌గా మారుతుంది.

కాల్షియం, విటమిన్ డి:
కాల్షియం, విటమిన్-డి ఉన్న ఆహాలు తీసుకుంటే సులభంగా కీళ్ల నొప్పులకు చెక్‌ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవి ఎముకలను దృఢంగా  చేసేందుకు సహాయపడతాయి.  కాబట్టి దీని కోసం మీరు రోజూ 15 నిమిషాల పాటు ఎండలో కూర్చొండి.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read : Kantara Telugu Movie Collections : ఒక్క రోజులోనే బ్రేక్ ఈవెన్.. ఫస్ట్ డే ఎంతంటే?

Also Read : Salaar Update : పృథ్వీరాజ్ భయంకరమైన లుక్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News