Winter Snacks For Weight Loss: శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది దుప్పటి కప్పుకుని నిద్రపోవాలనిపిస్తుంది. అంతేకాకుండా చలికాలంలో అధిక తీపి, కారం ఇతర పదార్థాలు తీసుకోవాలని కోరికలు కలుగుతాయి. దీని కారణంగా అదుపు లేకుండా వివిధ ఆహార పదార్థాలను తీసుకుంటాము. ఇలా చేయడం వల్ల అధిక బరువు సమస్య బారిన పడుతుంటాం. అయితే ఈ సమస్య నుంచి బయట పడాలి అంటే కొన్ని రకాల స్నాక్స్ తీసుకోవడం వల్ల చలికాలంలో అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
⟿ అధిక బరువును అదుపు చేయడంలో మాసాలా పుట్నాలు ఎంతో సహాయపడుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులోని ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి బరువు అదుపు చేయడంలో ఏంతో మేలు చేస్తాయి.
⟿ మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే బరువును అదుపులో ఉంచుతుంది.
⟿ రుచికరమైన ఆహారం తీసుకోవాలి అనుకుంటే ఓట్స్‌తో తయారు చేసే పోహ ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల శరీర బరువు అదుపులో ఉండటంతో పాటు వెచ్చగా కూడా ఉండవచ్చు.
Also read: Jaggery After Meal: భోజనం చేసిన తర్వాత బెల్లం తింటున్నారా ? అయితే ఇవి తప్పక తెలుసుకోండి!
⟿ ఫ్రూట్ చాట్‌ను కూడా తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అలాగే ఆకలి సమస్య, జీర్ణ సమస్య వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఫ్రూట్స్ బరువును తగ్గించడంలో మేలు చేస్తాయి.
⟿ పనీర్ టిక్కాను తయారు చేసి తినడం వల్ల ప్రోటీన్, క్యాల్షియం వంటి పోషకాలు పొందవచ్చు. దీని వల్ల బరువు కూడా పెరగకుండా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
ఈ విధంగా చలికాలంలో రుచికరమైన ఆహారం తినాలి అనిపించినప్పుడు వీటిని తప్పకుండా తీసుకోండి. దీని వల్ల అధిక బరువు పెరుగకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Also read: Diabetic Diet Tips: మీకు డయాబెటిస్ ఉందా, అయితే ఈ 5 పదార్ధాలకు దూరం తప్పదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter