Weight Loss Tips At Home: బరువు తగ్గే క్రమంలో చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇదే క్రమంలో మొండి కొవ్వును తగ్గించుకోవడం కూడా పెద్ద సమస్యగా మారింది. అయితే బరువు తగ్గడానికి పలు రకాల చిట్కాలు పాటించాలని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా బరువును సులభంగా తగ్గడానికి.. మొండి కొవ్వును నియంత్రించుకోవడానికి పలు రకాల ఆహార నియమాలు తప్పకుండా పాటించాలి. తక్కువ సమయంలో ఎక్కువగా బరువు తగ్గడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ను వినియోగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే మంచి పోషకాలున్న ఆహారాలను తీసుకోవడం వల్ల, వాటిలో యాపిల్ సైడర్ వెనిగర్‌ను వినియోగించడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. కావున బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా ఈ చిట్కాలను వినియోగించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బరువు తగ్గడానికి ఆపిల్ సైడర్ వెనిగర్‌ని వినియోగించాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సి అన్ని రకాల పోషకాలు ఉంటాయి. కావున వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. అయితే ఆపిల్ సైడర్ వెనిగర్‌తో చేసిన పదార్థాలు ఏం ఉంటాయని అనుకుంటున్నారా.. యాపిల్స్ రసంలో ఇది అధిక పరిమాణంలో ఉంటుంది. వీటిని క్రమంగా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరం దృఢంగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బరువు తగ్గడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ మంచిదేనా..?:
జర్నల్ ఆఫ్ ఫంక్షనల్ ఫుడ్స్‌లో ప్రచురించిన కథనాల ప్రకారం..ఆపిల్ సైడర్ వెనిగర్‌లో కేలరీలు తక్కువ పరిమాణంలో ఉంటాయి. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ వెనిగర్‌లో శరీరంలో బరువును సులభంగా నియంత్రిస్తాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి శరీరాన్ని యాక్టివ్‌గా చేస్తాయి.
ముఖ్యంగా యాపిల్ సైడర్ వెనిగర్‌లో బెల్లీ ఫ్యాట్ తగ్గించే గుణాలు అధిక పరిమాణంలో ఉంటాయి. అంతేకాకుండా జీవక్రియను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనితో పాటు, కొవ్వును జీర్ణం చేసే ఎంజైమ్‌ల కార్యకలాపాలను కూడా పెంచుతుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్ ఎలా ఉపయోగించాలి?
యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం చాలా సులభం, సాధారణం.. యాపిల్ సైడర్ వెనిగర్‌ను తాగే ముందు.. దానిని నీటిలో వేసుకుని తీసుకోవాలి. అంతేకాకుండా భోజనంతో పాటు సలాడ్ డ్రెస్సింగ్‌గా కూడా వినియోగించవచ్చు. ఇందులో ఉండే మూలకాలు బరువు తగ్గడానికి ప్రభావవంతంగా సహాయపడతాయి.
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు..
Also read: Weight Loss Diet: బరువు తగ్గాలనుకుంటున్నారా.. రోజూ డైట్‌లో ఈ సలాడ్స్‌ను తీసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook