Weight Loss Food: ఈ ఆకులను తినడం వల్ల బరువు తగ్గించడమే కాకుండా డయాబెటిక్ రోగులకు కూడా మేలు చేస్తుంది..!!

Guava Leaves Benefits: జామపండులో అనేక రకాల పోషక విలువలుంటాయి.  ఇది శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్ లకు మంచి ప్రయోజనాలను చేకూరుస్తాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 14, 2022, 10:48 AM IST
  • జామపండులో అనేక రకాల పోషక విలువలుంటాయి
  • డయాబెటిక్ రోగులకు మంచి మేలు
  • బరువు తగ్గడానికి సహాయపడుతుంది
 Weight Loss Food: ఈ ఆకులను తినడం వల్ల బరువు తగ్గించడమే కాకుండా డయాబెటిక్ రోగులకు కూడా మేలు చేస్తుంది..!!

Guava Leaves Benefits: జామపండులో అనేక రకాల పోషక విలువలుంటాయి.  ఇది శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్ లకు మంచి ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఇది జీర్ణక్రియ, ఇతర సమస్యలను తొలగించడానికి దోహదపడుతుంది. జామ పండే కాకుండా ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యనిపుణులు తెలుపుతున్నారు. జామ ఆకులను తీనడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం..

జామ ఆకుల ద్వారా శరీరానికి 5 ప్రయోజనాలు:

జామ ఆకుల్లో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి మీ శరీరానికి మేలు చేయ్యడమే కాకుండా మంచి లాభాలు ఇస్తాయి. అయితే ఆ లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. బరువు తగ్గడానికి సహాయపడుతుంది:

శరీరంలో కాంప్లెక్స్ స్టార్చ్ చక్కెరగా మారి బరువు పెరగడం ప్రారంభమవుతుంది. జామ ఆకులు బరువు తగ్గడానికి తోడ్పడతాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఈ ఆకులలో కార్బోహైడ్రేట్లను తగ్గించే శక్తి ఉండడం వల్ల వీటిని తింటే ఊబకాయం దూరమవుతుంది.

2. అతిసారం:

జామ ఆకులు అతిసారం వ్యాధి సమస్యతో బాధపడుతున్న వారికి ఎంతో ఉపయోగపడతాయి.  ఈ ఆకులను గ్లాసు నీటిలో వేసి మరిగించి రోజుకు రెండుసార్లు తాగితే పొట్ట తగ్గుతుంది.

3. కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిస్తుంది:

ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. దీనిని తగ్గించడానికి జామ ఆకుల టీ తాగడం మంచిదంటున్నారు.
ఇలా చేయడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

4. జుట్టుకు మంచిది:

జామ ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలను మెరుగుపరచడమే కాకుండా.. వీటిని మెత్తగా నూరి తలకు పట్టిస్తే జుట్టు సిల్కీగా అవుతుంది.

5. డయాబెటిస్‌:

జామ ఆకులతో తయారు చేసిన టీని తాగడం ద్వారా శరీరంలో ఆల్ఫా-గ్లూకోసిడేస్ ఎంజైమ్ చర్యను తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది.

(NOTE : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Orange Peel Benefits: నారింజ తొక్కతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా?

Also Read: MegaFamilyRankuMogudu: మహేష్-మెగా ఫ్యాన్స్ మధ్య యుద్ధం.. రంకు మొగుడు అంటూ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News