Political pada yatra: తెలుగు రాష్ట్రాల్లో నేతలు మళ్లీ తమ కాళ్లకు పని చెప్పబోతున్నారా ..? ప్రజా సమస్యల ఏజెండాగా ప్రజాక్షేత్రంలో పాదయాత్రలతో పోరాటానికి దిగబోతున్నారా..? గత నాయకుల పరంపరనే కొనసాగిస్తూ ఈ పాదయాత్రలో ప్రజలు కష్టాలను తెలుసుకోవాలనుకుంటున్నారా..? గతంలో పాదయాత్ర చేసిన వాళ్లంతా సీఎంలు అయ్యారా...? ఇప్పుడు పాదయాత్ర చేయాలనుకుంటున్న వాళ్లు కూడా సీఎంలు అవుతారా...?
Chandanagar Incident: భాగ్యనగర శివారులోని చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. హోటల్లో కుక్క వెంటపడటంతో మూడో అంతస్తు నుంచి కింద పడి యువకుడు మృతిచెందాడు.
Hyderabad Pub Raids: హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్ పబ్ పై వెస్ట్ జోన్ టస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్దంగా అందమైన యువతులతో పబ్లో అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించారు.
Rain Alert in Hyderabad: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడే కొద్దీ ఆ ప్రభావం తెలంగాణపై పడుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షసూచన జారీ చేసిన వాతావరణ శాఖ హైదరాబాద్కు కూడా వర్షాలు పొచి ఉన్నాయని తెలిపింది.
Ammavari Idiol Damaged: సికింద్రాబాద్ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాస్ పోర్ట్ ఆఫీసు సమీపంలోని కుర్మగూడలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. స్థానికంగా అక్కడ కొలువై ఉండే అమ్మవారి విగ్రహాన్ని ఎవరో గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Glammons Mrs India 2024 award winner: జెమినీ టీవీ యాంకర్ గా ప్రస్థానం ప్రారంభించిన హేమలత రెడ్డి తాజాగా విదేశాల్లో జరిగిన గ్లామన్ మిసెస్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచి సంచలనం రేపింది. రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన దసరా, బతుకమ్మ వేడుకల్లో సందడి చేసింది.
Glammonn Mrs india 2024: ప్రముఖ టీవీలో యాంకర్ గా పనిచేసిన ఆపై కథానాయికగా పరిచయమైన హేమలత రెడ్డి రీసెంట్ గా గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే కదా. బెస్ట్ ఫోటో జెనిక్, బెస్ట్ టాలెంట్ విభాగంలో అవార్డులు అందుకున్నారు. అందాల కిరీటం గెలిచిన తర్వాత హైదరాబాద్ కు తిరిగి వచ్చిన తర్వాత హైదరాబాద్ గచ్చిబౌలి లోని డెక్కన్ సరై గ్రాండ్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
Glammonn Mrs india 2024: విదేశాల్లో తెలుగు అమ్మాయి హేమలతా రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. జెమినీ టీవీ యాంకర్ గా ప్రస్థానం ప్రారంభించిన ఈమె.. ఆ తర్వాత ‘నిన్ను చూస్తూ’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. తాజాగా ఈ యేడాదికి గాను మలేషియాలో నిర్వహించిన గ్లామన్ మిసెస్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచింది.
Hyderabad Thunder Rains: అర్ధరాత్రి హైదరాబాద్ లో పిడుగుల వానతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. గత కొన్నేళ్లుగా ఎన్నడు లేనట్టుగా పిడుగులతో కూడిన వర్షాలతో నగర వాసులు భయ భ్రాంతులకు గురయ్యారు.
Hyderabad Rain : హైదరాబాద్ నగరంలో వర్షం దంచికొట్టింది. గంటపాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షానికి రహదారులు నదులను తలపించాయి. మెరుపులు, ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం నగరంలో బీభత్సం స్రుష్టించింది. గంటపాటు కురిసిన కుండపోత వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది.
Khairatabad Ganesh: తెలుగు రాష్ట్రాల్లో ఒక్క గణపతికి ఒక్కో విశిష్ఠత ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్దదైన గణేష విగ్రహం కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఖైరతాబాద్ లో కొలువై భక్తులకు దర్శనిమిస్తుంది. అయితే.. ఈ గణేషుడిని దర్శించుకోవడానికి హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఖైరతాబాద్ వచ్చి గణేషుడిని ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ వస్తోంది. తాజాగా ప్రజలకు వరుస సెలవులు రావడంతో చాలా మంది ప్రజలు ఖైరతాబాద్ గణేషుడి దర్శనానికి పోటెత్తడంతో అక్కడ రద్దీ నెలకొంది. దీంతో భక్తులు దర్శనానికి రావొద్దంటూ భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Kaloji Birth Anniversary Celebrations: ప్రజాకవి కాళోజీ నారాయణ రావు 110వ జయంతి వేడుకలను హైదరాబాద్ రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆయన జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవ వేడుకల్లో బతుకంతా దేశానిది నాటకాన్ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో నటీనటులు అద్భుతంగా నటించి.. వీక్షకుల మెప్పుపొందారు.
Hyderabad Rains: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో గత రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు ప్రజలు అల్లాడుతున్నారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ జంట జలాశయాలతో పాటు హుస్సేన్ సాగర్ నిండు కుండలను తలపిస్తున్నాయి. దీంతో ఈ జలాశయం పరిసర ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
Traffic Alerts: హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు భారీగా వర్షం పడింది. ఏకధాటికగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ నదులను తలపించాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంబర్ పేట, మలక్ పేట, దబీర్ పురా, ఎన్ఎండీసీ, నల్లగొండ ఎక్స్ రోడ్డు, చాదర్ ఘాట్ ఎక్స్ రోడ్డు, గోల్నాక ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ప్రాంతాల నుంచి కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
Hyderabad Heavy Rains: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. రాత్రి నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో ఊహించని పరిమాణంలో భారీ వర్షం కురుస్తోంది. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Abhinav: శ్రీలక్ష్మి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న బాలల చిత్రం "అభినవ్" (chased padmavyuha). భీమగాని సుధాకర్ గౌడ్ నిర్మాత మరియు దర్శకునిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ట్రైలర్ ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఫిల్మ్ ఛాంబర్ లో రిలీజ్ చేశారు.
Ramdas Athawale: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఆయనతో పాటు 71 మంది క్యాబినేట్, స్వతంత్య్ర, సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. అయితే నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో రామ్ దాస్ అఠావలె మరోసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు.
Jr NTR - High Court: గత కొన్నేళ్లుగా ఎలాంటి వివాదాలు లేకుండా తన సినిమాలే లోకంగా బతుకుతున్న ఎన్టీఆర్.. తాజాగా ఓ స్థలం విషయంలో వివాదంలో చిక్కుకున్నారు. దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు తారక్.
Hyderabad Lok Sabha Election 2024: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 7 విడతల్లో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 4వ విడతలో ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్ధి తను పోటీ చేస్తోన్న పార్లమెంట్ సీటులో బురఖాలను తనిఖీ చేస్తూ సంచలనం రేపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.