Hyderabad Pub Raids: బంజరాహిల్స్ పబ్బులో బమ్ చిక్ బమ్ డాన్సులు..

Hyderabad Pub Raids: హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్ పబ్ పై వెస్ట్ జోన్ టస్క్ ఫోర్స్  పోలీసులు దాడులు నిర్వహించారు.  నిబంధనలకు విరుద్దంగా అందమైన యువతులతో పబ్‌లో అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 19, 2024, 11:37 AM IST
Hyderabad Pub Raids: బంజరాహిల్స్ పబ్బులో బమ్ చిక్ బమ్ డాన్సులు..

Hyderabad Pub Raids: భాగ్య నగరంలో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్  పరిధిలోని టాస్ పబ్ లో యువతులతో అసభ్యకరమైన డాన్సులు చేయిస్తున్నారనే కారణంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.  పబ్‌లో  కస్టమర్లను ఆకర్షించేందుకు 42 మంది యువతులతో నిర్వాహకులు అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నారని పోలీసులు వెల్లడించారు.

అశ్లీలంగా డ్యాన్సులు చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు పబ్‌పై కేసు నమోదు చేశారు. దాడి చేసిన సమయంలో పబ్‌లో మెుత్తం 100 మంది పురుషులను... 42 మంది మహిళలు ఉన్నారు. ఇందులో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు చెందిన కుటుంబ సభ్యులు ఉన్నట్టు తెలుస్తోంది.

అంతేకాదు పోలీసులు ఈ దాడి ఘటనలో వాళ్ల వివరాలను గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో సినీ, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్లు ఈ పబ్ కు తరుచుగా వస్తుంటారని సమాచారం. వాళ్ల కోసమే పబ్ నిర్వహకులు... వేరే రాష్ట్రానికి చెందిన  కొంత మంది యువతులతో సినిమాల్లో చూపించిన మాదిరి అసభ్యకరమైన డాన్సులు, స్టెప్పులతో కస్టమర్స్ ను ఆకర్షిస్తున్నారు.

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

ఏది ఏమైనాఇలాంటి ఘటనలు హైదరాబాద్ సహా అన్ని చోట్ల సర్వసాధారణమైపోయాయి. ముఖ్యంగా పోలీసులకు కొంత మంది ఉన్నతాధికారులకు ఆయా పబ్ ల యాజమాన్యాల నుంచి ముడుపులు అందితే.. ఈ దాడులు జరగవనే ఆరోపణలున్నాయి. ఏది ఏమైనా పోలీస్ డిపార్టమెంట్ లో నిజాయతీగల అధికారులు ఇలాంటి పబ్ ల యజమానుల తాట తీస్తుంటే..  డబ్బుకు, అవినీతి పాల్పడే అధికారులు మాత్రం మాముళ్ల మత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్న చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా పోలీసులు తరుచుగా తనిఖీలు నిర్వహిస్తే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవంటున్నారు.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x