ఢిల్లీ: కరోనావైరస్ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 1,553 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా సోకి 36 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. సోమవారం సాయంత్రం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. "ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 17,265కు పెరిగిందని.. అందులో 14,175 యాక్టివ్ కేసులు ఉన్నాయి" అని అన్నారు. సోమవారం వరకు కరోనా వైరస్ నుంచి 2,546 మంది కోలుకొని డిశ్చార్జ్ అవగా.. కరోనా బారినపడి 543 మంది చనిపోయారని లవ్ అగర్వాల్ తెలిపారు. ముంబై, కోల్‌కతా, జైపూర్, ఇండోర్, పూణె వంటి నగరాల్లో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోందని, అక్కడి పరిస్థితి క్లిష్టంగానే ఉందని లవ్ అగర్వాల్ స్పష్టంచేశారు.
Also read : ఏపీలో కొత్తగా మరో 75 కరోనా కేసులు
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనావైరస్ నియంత్రణలోకి వచ్చిందని చెబుతూ.. దేశవ్యాప్తంగా 59 జిల్లాల్లో గత 14 రోజుల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని అన్నారు. అంతేకాకుండా గోవా కూడా కరోనా రహిత రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..