6th Phase Lok Sabha Polls: ఆరో విడత ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్రపతి, సోనియా సహా ప్రముఖులు..

6th Phase Lok Sabha Polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఆరో విడతలో 58 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ విడతలతో ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌,ఒడిషా హర్యానలతో పాటు దేశ రాజధాని దిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దిల్లీలో జరుతున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : May 25, 2024, 11:05 AM IST
6th Phase Lok Sabha Polls: ఆరో విడత ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్రపతి, సోనియా సహా ప్రముఖులు..

  

6th Phase Lok Sabha Polls: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రపంచంలోని అతిపెద్దదైన ప్రజాస్వామ్యానికి జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఇప్పటికే 5 విడతల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఈ రోజు ఆరో విడతలో భాగంగా 58 స్థానాలకు ఎన్నికలు జరుతున్నాయి. ఈ విడదలో దేశ రాజధాని దిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రాష్ట్రపతి నిలయంలోని రాజేంద్ర ప్రసాద్ స్కూల్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ సతీ సమేతంగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అటు విదేశాంగ మంత్రి జై శంకర్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, తన కుమారుడు రాహుల్ గాంధీతో కలిసి దిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు మరో కీలక నేత ప్రియాంక గాంధీ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌తో పాటు.. కపిల్ దేవ్ దంపుతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో ఉన్నారు. అటు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాజధాని భువనేశ్వర్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సెలబ్రిటీలు, సామాన్య పౌరులు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక జూన్ 1న జరిగే 7వ విడతతో ఎన్నికల ప్రక్రియ మొత్తంగా పూర్తవుతోంది. జూన్ 4న దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ సీట్లకు కౌంటింగ్ జరగనుంది.

 

  

Trending News