Bird Flu Scare: హర్యానాలో 10 రోజుల్లో 4 లక్షల పక్షుల మరణం.. మరిన్ని భయపెట్టే నిజాలి

Bird Flu Scare:బర్డ్ ఫ్లూ వార్తలు రాగానే జమ్మూ కశ్మీర్ అధికారుల్లో చలనం మొదలైంది. వలస పక్షులు ఎక్కువగా వచ్చే రాష్ట్రాల్లో ఇప్పటికే పలు చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. ఇందులో హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2021, 07:24 AM IST
    1. బర్డ్ ఫ్లూ వార్తలు రాగానే జమ్మూ కశ్మీర్ అధికారుల్లో చలనం మొదలైంది.
    2. వలస పక్షులు ఎక్కువగా వచ్చే రాష్ట్రాల్లో ఇప్పటికే పలు చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు.
    3. ఇందులో హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి.
Bird Flu Scare: హర్యానాలో 10 రోజుల్లో 4 లక్షల పక్షుల మరణం.. మరిన్ని భయపెట్టే నిజాలి

Bird Flu in India: భారతదేశ  పాల్ట్రీ రంగంపై బర్డ్ ఫ్లూ కత్తి వేలాడుతోంది. తొలూత కేరళలో బయటపడ్డ ఏవియన్ ఇంప్లూయెన్సా లేదా బర్డ్ ఫ్లూ కేసులు ఇప్పుడు దేశ వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. కేరళ, రాజస్థాన్‌లో భారీ సంఖ్యలో పెంపుడు పక్షులు మరణిస్తున్నాయి. అదే సమయంలో పర్యావరణ మంత్రిత్వ శాఖ, అటవీ శాఖతో పాటు వివిధ శాఖలు చర్యలు ప్రారంభించాయి.

ALSO READ| Calories Count: మీ ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో తెలుసుకోండి

తాజాగా ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్‌లో కూడా బర్డ్ ఫ్లూ సోకి పక్షులు మరణించాయి.బర్డ్ ఫ్లూ వార్తలు రాగానే జమ్మూ కశ్మీర్ అధికారుల్లో చలనం మొదలైంది. వలస పక్షులు ఎక్కువగా వచ్చే రాష్ట్రాల్లో ఇప్పటికే పలు చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. ఇందులో హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh), రాజస్థాన్, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి.

ALSO READ|  Immunity Booster Tea: ఇమ్యూనిటీని పెంచే అల్లం పసుపు ఛాయ్

హర్యానాలో తీవ్రత..
కాగా హర్యానాలో (Haryana) సుమారు 4 లక్షల పక్షులు మరణించినట్టు సమాచారం. గత 10 రోజుల్లోనే పంచుకుల అనే జిల్లాలో అత్యధికంగా నష్టం వాటిల్లింది. పంచకులలోని బర్వాల, రైపూర్ రాణీ ప్రాంతాల్లో దేశంలోనే అత్యధికంగా కోళ్ల పెంపకం జరుగుతుంది. అక్కడ సుమారు కోటి వరకు పక్షులను 100 పైగా పాల్ట్రీల్లో పెంచుతున్నారు. బర్డ్ ఫ్లూ ప్రమాదం నుంచి గట్టెకేందుకు హర్యానా పశుసంవర్ధన శాఖ రంగంలోకి దిగి చర్యలు ప్రారంభించింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News