అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నుంచి ఫలితాలు వచ్చి నెల గడుస్తున్నా పశ్చిమ బెంగాల్‌లో బాంబులు కలకలం రేపుతున్నాయి. వాడివేడిగా జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో బాంబుల (Bombs Recovered Near BJP Office)ను స్వాధీనం చేసుకుని సిబ్బంది నిర్వీర్యం చేయడం తెలిసిందే.
తాజాగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఒకేచోట భారీ మొత్తంలో బాంబులు లభ్యమయ్యాయి. రాజధాని కోల్‌కతా ప్రజలు ఈ విషయం తెలియడంలో ఉలిక్కి పడుతున్నారు. కోల్‌కతాలోని భారతీయ జనతా పార్టీ (BJP Office In Kolkata) సమీపంలో 51 బాంబులను యాంటీ రౌడీ విభాగం శనివారం రాత్రి గుర్తించి, స్వాధీనం చేసుకుంది. ఆర్మీ నిఘా విభాగం నుంచి పక్కా సమాచారం అందుకున్న యాంటీ రౌడీ విభాగం సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేపట్టిన బాంబులను గుర్తించినట్లు ఉన్నతాదికారులు తెలిపారు.
Also Read: Harish Rao slams Etela Rajender: ఈటల రాజేందర్‌కు మంత్రి హరీష్ రావు కౌంటర్
కోల్‌కతాలోని బీజేపీ కార్యాలయానికి కేవలం 100 అడుగుల దూరంలో ఓ సంచిని గుర్తించారు. తీసి చూడగా అందులో 51 బాంబులు ఉన్నాయని.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాంబులు అక్కడ ఎవరు ఉంచారు, దేనికోసం ఈ పనిచేశారనే దిశగా విచారణ జరుగుతోంది. కాగా, West Bengal ఎన్నికల ప్రచారం సమయంలో నానూర్‌లో 200 బాంబులు, బాంబుల తయారీ సామాగ్రిని స్వాధీనం పోలీసులు స్వాధీనం చేసుకోవడం తెలిసిందే.
Also Read: LPG Gas Paytm Offer: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ క్యాష్‌బ్యాక్ ఆఫర్, Freeగా LPG Cylinder
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook