Independence Day: ఆగష్టు 15, జనవరి 26న జాతీయ జెండా ఎగురవేయటంలో తేడా ఉంటుంది తెలుసా?

India Independence Day 2022: భారతదేశంలో రెండు సార్లు జాతీయ జెండాలు ఎగురవేస్తాం. అవి ఆగస్టు 15, జనవరి 26. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆగస్టు 15న జరుపుకుంటాం. భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చిన జనవరి 26న తేదిన గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటాం.

Written by - Srisailam | Last Updated : Aug 15, 2022, 09:05 AM IST
Independence Day: ఆగష్టు 15, జనవరి 26న జాతీయ జెండా ఎగురవేయటంలో తేడా ఉంటుంది తెలుసా?

India Independence Day 2022: భారతదేశంలో రెండు సార్లు జాతీయ జెండాలు ఎగురవేస్తాం. అవి ఆగస్టు 15, జనవరి 26. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆగస్టు 15న జరుపుకుంటాం. భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చిన జనవరి 26న తేదిన గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటాం. ఈ రెండు రోజులు దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపిస్తుంది. వాడవాడలా త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతాయి.అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగురవేస్తారు. అయితే ఆగస్టు 15, జనవరి 26న జాతీయ జెండా ఎగురవేయడంలో తేడాలు ఉంటాయి. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఆ రెండు రోజులు జాతీయ జెండా ఎగురవేయడంలో మూడు ప్రధాన తేడాలు ఉంటాయి. స్వాతంత్ర్య దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగురవేయడానికి తేడాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

జెండా ఎగురవేయడం మరియు విప్పడం

ఆగస్టు 15 ఇండిపెండెన్స్ రోజున జాతీయ జెండాకు కర్రకు కింద కడతారు.  జెండాను తాడుతో కింది నుండి పైకి లాగి.. జెండా కర్రపైకి వెల్లగానే తాడును లాగి విప్పుతారు.  దీనిని జెండా ఎగురవేయడం అంటారు. బ్రిటీషర్ల నుంచి భారత్ స్వాతంత్రం పొందిందని చెప్పడానికి వీలుగా ఇలా జాతీయ జెండాను ఎగురవేస్తారు. దీనినే ఆంగ్లంలో ఫ్లాగ్ హోస్టింగ్ అంటారు. కాని  జనవరి 26 రిపబ్లిక్ డే రోజు మాత్రం జెండా కర్ర పై భాగంలో తివర్ణ పతాకం కట్టబడి ఉంటుంది. తాడుతో దాని విప్పి ఆవిష్కరిస్తారు. రాజ్యాంగ బాషలో దీనిని జెండా  విప్పడం అంటారు. ఇంగ్లీషులో అయితే ఫ్లాగ్ అన్ ఫర్ల్ అంటారు.

స్వాతంత్ర దినోత్సవం రోజున దేశ ప్రధానమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. భారత్ కు స్వాతంత్రం వచ్చినరోజున మన రాజ్యాంగం అమలులోకి రాలేదు. ఆ సమయంలో దేశానికి రాష్ట్రపతి లేరు. అందుకే స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి జాతీయ జెండాను ఎగురవేస్తారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా  రాష్ట్రపతి తన సందేశాన్ని దేశానికి ఇస్తారు. గణతంత్ర దినోత్సవాన్ని  దేశంలో రాజ్యాంగం అమలుకు గుర్తుగా జరుపుకుంటారు. అందుకే జనవరి 26న దేశ  రాజ్యాంగ అధిపతి రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగురవేస్తారు.

స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15న ఎర్రకోటలో ప్రధానమంత్రి జాతీయ జెండాను ఎగురవేస్తారు. రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు జెండా ఆవిష్కరిస్తారు. రిపబ్లిక్ డే జనవరి 26న  రాజ్‌పథ్‌లో  రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగురవేస్తారు. రాష్ట్రాల్లో గవర్నర్లు జాతీయ జెండా ఎగురవేస్తారు. ఈ మూడు ప్రధాన తేడాలు ఉన్నా చాలామందికి తెలియదు. 

Read also: Revanth Reddy: రేవంత్ ను ఇరికించే పనిలో సీనియర్లు.. మునుగోడులో తేడా వస్తే పీసీసీ అవుట్?

Read also: TRS MLA COMMENTS:కేసీఆర్ పిలుపు మేరకు దేశానికి స్వాతంత్ర్యం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే విడ్డూరం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News