EC clarity on Bihar Elections: న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ( Bihar Elections ) ఎన్నికలను సకాలంలోనే నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ ( Election Commission) స్పష్టం చేసింది. కరోనావైరస్ (Coronavirus) సంక్షోభం, వరదల ప్రభావం వల్ల బీహార్ అసెంబ్లీ ఎన్నికలను (bihar assembly elections 2020) వాయిదా వేయాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని తోసిపుచ్చింది. దీనిపై కేంద్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి పెరుగుతున్న వేళ తాము అన్ని రకాల జాగ్రత్తలు, చర్యలు తీసుకుని బీహార్‌లో ఎన్నికలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రీయ జనతాదళ్, లోక్ జనశక్తి పార్టీలు బీహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని కోరిన నేపథ్యలో ఈసీ ఈ ప్రకటన చేసింది. ఇదిలా ఉంటే.. ప్రజల భద్రత, సంక్షేమం ముఖ్యమని, ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించవద్దని కాంగ్రెస్ ఈసీని కోరింది. Also read: Punjab Govt: విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు
బీహార్ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకునేందుకు మంగళవారం (11 ఆగస్టు) గడువు విధిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. అయితే నవంబరు 29వతేదీతో బీహార్ అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. Also read: India: 45వేలు దాటిన కరోనా మృతులు