Puja Khedkar: యూపీఎస్సీకి బిగ్ ట్విస్ట్.. కోర్టులో సంచలన వ్యాఖ్యలు చేసిన పూజా ఖేడ్కర్.. అసలేం జరిగిందంటే..?

Trainee ias puja khedkar: పూణే కు చెందిన వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ ఘటనలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనతో తాజాగా, ఆమె ఢిల్లీ హైకోర్టులో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.  

Written by - Inamdar Paresh | Last Updated : Aug 28, 2024, 06:22 PM IST
  • యూపీఎస్సీకి చుక్కలు చూపించిన పూజా..
  • మరోసారి వార్తలలో నిలిచిన ట్రైనీ ఐఏఎస్ ఘటన..
 Puja Khedkar:  యూపీఎస్సీకి బిగ్ ట్విస్ట్.. కోర్టులో సంచలన వ్యాఖ్యలు చేసిన పూజా ఖేడ్కర్.. అసలేం జరిగిందంటే..?

Puja khedkar fire on upsc: మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన పూజా ఖేడ్కర్ ఘటన దేశంలో పెనుసంచలనంగా మారిన విషయం తెలిసిందే. యూపీఎస్సీ ట్రైనింగ్ లో  భాగంగా .. పూజాను పూణేకు అలాట్ చేశారు. కానీ అక్కడ  స్థానిక కలెక్టర్ కు సమానంగా..తనకు సదుపాయాలు కావాలని కూడా డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. ఏకంగా కలెక్టర్ లేనప్పుడు.. ఆయన గదిలోని ఫర్నీచర్ ను తన గదిలోకి షిఫ్ట్ చేయించుకున్నారు. ట్రైనీ గా ఉండగానే.. ఏసీపీ స్థాయి అధికారికి చోరీ విషయంలో దొంగను వదిలేయాలని కూడా ఒత్తిడి చేశారు.

పూజా ఖేడ్కర్ సివిల్స్  కోసం.. పదుల సార్లు ఎగ్జామ్ లు రాసినట్లు తెలుస్తోంది. ఆమె దివ్యాంగురాలి కోటా, బీసీ కోటాల్లో పలు మార్లు ఎగ్జామ్ లను రాసింది. అంతేకాకుండా.. ఆమె సివిల్స్ లో యూపీఎస్సీకి సబ్మిట్ చేసిన అన్ని సర్టిఫికెట్లు కూడా నకిలీవని కూడా తెలింది. పూణేలో ఆమె కలెక్టర్ ఆఫీసులో చేసిన ఘనకార్యంపై.. అక్కడి అధికారి మహారాష్ట్ర ప్రభుత్వం, యూపీఎస్సీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై విచారణ చేపట్టారు.  

ఈ క్రమంలో పూజా ఖేడ్కర్ కు సంబంధించి అనేక విస్తూపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా.. పూజా ఖేడ్కర్ తండ్రి, తల్లి కూడా అనేక అక్రమాలకు పాల్పడినట్లు కూడా ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు సైతం కేసులను నమోదు చేశారు. పూజాకు సంబంధించిన పూణేలో నిర్మించిన ఇల్లు.. పూర్తిగా నిబంధలనకు విరుద్ధంగా ఉండటంతో అధికారులు సైతం కూల్చివేశారు.

ఇలా అనేక అక్రమాలు వెలుగులోకి రావడం, పూజా ఖేడ్కర్ సబ్మిట్ చేసిన పత్రాలు నకిలీవని తెలడంతోపాటు, ఆమె ఫోర్జరీలకు సైతం పాల్పడినట్లు యూపీఎస్సీ గుర్తించింది. దీంతో పూజా ఖేడ్కర్ ను.. దీనిపై వివరణ ఇచ్చేందుకు కొంత సమయం ఇచ్చింది. కానీ ఆమె నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో పూజా ఖేడ్కర్ ను శాశ్వతంగా యూపీఎస్సీ నుంచి డిబార్ చేస్తున్నట్లు కూడా ఇటీవల.. యూపీఎస్సీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆమె  తాజాగా కోర్టులో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.

పూర్తి వివరాలు..

పూజా ఖేడ్కర్ ఘటన మరోసారి వార్తలలో నిలిచింది. కొన్నిరోజుల క్రితం పూజా .. దుబాయ్ కు సైతం పారిపోయిందని కూడా రూమర్స్ వచ్చాయి. ఈ క్రమంలో పూజా ఖేడ్కర్ కేసు ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టుల పరిధిలో ఉంది. దీనిలో ఈ రోజు విచారణ జరిగినట్లు తెలుస్తోంది. దీనిలో పూజా యూపీఎస్సీపై నిప్పులు చెరిగారు.. తనపై వేటు వేసే అధికారం యూపీఎస్సీకి లేదంటూ కూడా ఫైర్ అయ్యారు.

Read more: Kolkata murder case: కోల్ కతా డాక్టర్ ఘటన భయానకం.. తొలిసారి సంచలన వ్యాఖ్యలు చేసిన రాష్ట్రపతి..  

అంతేకాకుండా.. తాను ఎలాంటి తప్పిదాలు చేయలేదంటూ కూడా మరోసారి వాదించారు. ఒక వేళ తనపై చర్యలు తీసుకొవాలంటూ.. డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కు (Dopt) అఖిల భారత సర్వీసుల చట్టం కింద మాత్రమే హక్కు ఉంటుదని కూడా తెల్చిచెప్పింది. ఇదిలా ఉండగా.. పూజా ఖేడ్కర్ ను అరెస్టుపై ఢిల్లీ హైకోర్టు ఆగస్టు 29 వరకు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు కోర్టులో విచారణ నేపథ్యంలో పూజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News