ఎమ్మెల్యేలు ''మిస్సింగ్‌”:కాంగ్రెస్‌–జెడిఎస్‌ కూటమిలో ఆందోళన

కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏ ఒక్క పార్టీకి మ్యాజిక్ ఫిగర్(113) రాలేదు. బీజేపీకి 104, కాంగ్రెస్ కు 78, జేడీ(ఎస్)కు 38, ఇతరులకు 2 సీట్లు దక్కాయి.  

Last Updated : May 16, 2018, 12:01 PM IST
ఎమ్మెల్యేలు ''మిస్సింగ్‌”:కాంగ్రెస్‌–జెడిఎస్‌ కూటమిలో ఆందోళన

బెంగళూరు: కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏ ఒక్క పార్టీకి మ్యాజిక్ ఫిగర్ (113) రాలేదు. బీజేపీకి 104, కాంగ్రెస్ కు 78, జేడీ(ఎస్)కు 38, ఇతరులకు 2 సీట్లు దక్కాయి.  

దీంతో మంగవారం కర్ణాటకలో రాజకీయాలు చకచకా మారాయి. బీజేపీ పార్టీ ఆధిక్యతలో ఉండగా.. మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ, 'జేడీఎస్ ప్రభుత్వ ఏర్పాటు మద్దతు ఇస్తాము' అని తెరపైకి తెచ్చింది. దీనికి అంగీకరించిన జేడీఎస్ సీఎం అభ్యర్థి కుమారస్వామి గవర్నర్ కు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరారు. అటు బీజేపీ పార్టీ.. సంప్రదాయం ప్రకారం, తమ పార్టీనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరగా.. గవర్నర్ బలనిరూపణకు ఏడు రోజుల గడువు ఇచ్చారు. దీంతో కాంగ్రెస్, జేడీఎస్ లు ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలను రక్షించుకొనే పనిలో పడ్డారు.   

బుధవారం కన్నడ రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్‌ పార్టీ శాసనసభాపక్ష (సిఎల్‌పి) సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యేలు భీమా నాయక్‌, అమెర్‌గౌడ నాయక్‌, ఆంనద్‌సింగ్‌, నాగేంద్ర, రాజశేఖర్‌ పాటిల్‌ అందుబాటులో లేకుండా పోయారు. వారిని ట్రేస్‌ చేయడానికి చేసిన ప్రయత్నాలు వృధా అయ్యాయి. దీనితో కాంగ్రెస్‌ – జెడిఎస్‌ కూటమిలో ఆందోళన ప్రారంభమైంది. అయితే కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి కెఎస్‌ ఈశ్వరప్ప మాట్లాడుతూ ‘అసంతృప్త’ ఎమ్మెల్యేలు పార్టీతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. మరోవైపు ఈరోజు ఓ హోటల్‌లో జరిగిన జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి  ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. రాజా వెంకటప్ప నాయక, వెంకటరావు గౌడ అనే ఇద్దరు ఎమ్మెల్యేలు సమావేశానికి రాలేదు.

 

 

 

 

 

గవర్నర్ పక్షపాత ధోరణితో వ్యవహరించకూడదు: ఆజాద్  

గవర్నర్‌ పక్షపాత ధోరణితో వ్యవహరించకూడదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ అన్నారు. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై ఆజాద్‌ మాట్లాడుతూ అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి సంఖ్యాబలం లేదని, వారికి 104 సీట్లు మాత్రమే వచ్చాయని అన్నారు. తమ కాంగ్రెస్‌-జేడీఎస్ కూటమికి 117 సీట్లు ఉన్నాయన్నారు. గవర్నర్‌ రాజ్యాంగాన్ని రక్షించాలని ఆజాద్‌ అన్నారు.

 

బీజేపీ  విశ్వ ప్రయత్నాలు చేస్తోంది: రామలింగారెడ్డి

కర్ణాటకలో అధికారం చేపట్టడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ నేత రామలింగారెడ్డి చెప్పారు. బీజేపీ తమ కూటమి ఎమ్మెల్యేలను ప్రలోభపరిచే యత్నాలు చేస్తోందన్నారు. అయినప్పటికీ తమ ఎమ్మెల్యేలపై తమకు పూర్తి విశ్వాసముందని ఆయన చెప్పారు. తమ కూటమిలో ప్రతి ఒక్కరూ సంతోషంగానే ఉన్నారని, ఎవరూ అసంతృప్తితో లేరని ఆయన అన్నారు.

 

బీజేపీ మంత్రి పదవి ఇస్తామంది: కాంగ్రెస్ ఎమ్మెల్యే

బీజేపీ నేతలు తన వద్దకు వచ్చారని, తనకు మంత్రి పదవి ఇస్తామని ఆఫర్‌ చేశారని కాంగ్రెస్‌ నాయకుడు అమరెగౌడ లింగనగౌడ పాటిల్‌ బయ్యాపూర్‌ చెప్పారు. అయితే తాను మాత్రం జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమినుంచి బైటికి వెళ్లే పరిస్థితి ఎంతమాత్రం ఉత్పన్నం కాదన్నారు. ‘బీజేపీ నేతలు ఫోన్‌ చేశారు. తమ వద్దకు రమ్మని కోరారు. మంత్రి పదవి ఇస్తామన్నారు. కానీ నేను తిరస్కరించాను. నేను ఇక్కడే ఉంటాను. హెచ్‌డి కుమారస్వామి మా ముఖ్యమంత్రి’ అని పాటిల్‌ చెప్పారు.

 

Trending News