కేంద్రం ఆధార్ ను అన్నింటికీ తప్పనిసరి చేసిందన్న విషయం అందరికీ తెలిసిందే..! ఇదివరకు ఆధార్ నెంబర్-పాన్ కార్డు, ఆధార్ నెంబర్-బ్యాంక్ అకౌంట్... ఇలా ప్రతిదానికి అనుసంధానం చేసినట్లు మొబైల్ నెంబర్ ను కూడా ఆధార్ తో అనుసంధానం తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పింది. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలిపింది.
ఆధార్ ను ఆన్లైన్ లో అప్డేట్ చేసుకోవాలంటే మొబైల్ నెంబర్ తప్పనిసరి. కనుక ఆధార్ నెంబర్ తో మీ మొబైల్ నెంబర్ ను లింక్ చేసుకుంటే ఏ సమస్య ఉండదు. ఇదివరకు బయట సిమ్ కార్డు స్టోర్ లకు వెళ్లి ఆధార్ తో లింక్ చేసుకొనేవారు. కానీ ఇప్పుడు మీరు బయటకు వెళ్లకుండా ఎంచక్కా ఇంట్లోనే మొబైల్ నెంబర్ తో ఆధార్ నెంబర్ ను లింక్ చేసుకోవచ్చు.
ఎలా మొబైల్ నెంబర్ ను ఆధార్ నెంబర్ తో అనుసంధానం చేసుకోవాలంటే..
- మీ నెంబర్ ఏ నెట్ వర్క్ దైనా సరే.. 14546 నెంబర్ కు కాల్ చేయండి.
- ఆ నెంబర్ కు కాల్ చేయగానే మీరు ఇండియావారా లేదా ఎన్నారైనా అని అడుగుతుంది. అందులో మీరు ఏదైతే దాన్ని ఎంచుకోండి.
- తరువాత 1ని ఎంచుకోవాలి. తరువాత మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ను టైప్ చేసి మళ్లీ 1ని నొక్కాలి. పిదప మీ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది.
- తరువాత మీ మొబైల్ నెంబర్ ను ఇచ్చి.. మొబైల్ నెంబర్ లోని చివరి నాలుగు అంకెలు కరెక్టో కాదో ధృవీకరించాలి.
- కరెక్ట్ అని ధృవీకరించాక.. మీ మొబైల్ కు వచ్చిన ఓటీపీ ఇవ్వాలి. తరువాత మళ్లీ 1ని నొక్కి మీ ఆధార్ నెంబర్ ను మరోసారి సరిచూసుకుని పూర్తిచేయవచ్చు.
- ఒకేవేళ మీరు అప్పటికే ఆధార్ తో అనుసంధానం చేసుకొని ఉంటే.. ఆ విషయాన్ని మీకు తెలియజేస్తుంది.
గమనిక: ఆధార్ నెంబర్ తో మీ మొబైల్ నెంబర్ ను మార్చి 31, 2018లోపు తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలి.