పెళ్లయిన కొన్నాళ్లకు తెలిసిన షాకింగ్ నిజం... సుప్రీం కోర్టును ఆశ్రయించిన భర్త...

Husband cheating case against Wife:వాళ్లిద్దరికీ కొన్నేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయిన కొన్నాళ్ల వరకు భార్య అతన్ని దగ్గరకు రానివ్వలేదు. ఆ తర్వాత ఇద్దరు కలయిక కోసం ప్రయత్నించగా భర్తకు ఊహించని షాక్ ఎదురైంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 13, 2022, 06:17 PM IST
  • తన భార్యకు మగ లక్షణాలు ఉన్నాయంటూ కోర్టును ఆశ్రయించిన భర్త
  • తనను మోసం చేశారంటూ పిటిషన్‌లో ఆరోపణ
  • సుప్రీం కోర్టులో విచారణకు వచ్చిన కేసు
 పెళ్లయిన కొన్నాళ్లకు తెలిసిన షాకింగ్ నిజం... సుప్రీం కోర్టును ఆశ్రయించిన భర్త...

Husband cheating case against Wife: వాళ్లిద్దరికీ కొన్నేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయిన కొన్నాళ్ల వరకు భార్య అతన్ని దగ్గరకు రానివ్వలేదు. ఆ తర్వాత ఇద్దరు కలయిక కోసం ప్రయత్నించగా భర్తకు ఊహించని షాక్ ఎదురైంది. తన భార్యకు పురుషుల మాదిరి జననేంద్రియాలు ఉన్నట్లు అతను గమనించాడు. తాను మోసపోయానని.. స్త్రీ అని చెప్పి ఒక పురుషుడితో తనకు వివాహం చేశారని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించాడు. తాజాగా ఈ కేసు సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కి చెందిన ఆ వ్యక్తికి 2016లో వివాహమవగా.. భార్య అతన్ని దూరం పెడుతూ వచ్చింది. కొన్నాళ్లకు శారీరకంగా కలిసేందుకు ప్రయత్నించగా ఆమెకు పురుషుల లాగే జననేంద్రియాలు ఉన్నట్లు గమనించాడు. దీంతో ఆమెను వైద్య పరీక్షలకు తీసుకెళ్లగా... ఆమెకు జెనెటిక్ డిజార్డర్‌ ఉందని.. ఆ కారణంగానే ఆమెకు పురుషుల లాగా జననేంద్రియాలు ఏర్పడ్డాయని తేలింది. ఇందుకోసం సర్జరీ చేయించుకోవాల్సిందిగా వైద్యులు ఆమెకు సూచించారు.

ఇదంతా జరిగాక ఇక ఆమెతో కాపురం చేయలేనని భర్త తెగేసి చెప్పాడు. ఆమెను పుట్టింటికి పంపించేశాడు. దీంతో అతని భార్య, ఆమె కుటుంబ సభ్యులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య తనపై కేసు పెట్టడంతో ఆగ్రహించిన సదరు భర్త.. ఆమెతో పాటు ఆమె కుటుంబంపై చీటింగ్ కేసు పెట్టాడు. దీనిపై ట్రయల్ కోర్టులో విచారణ జరగా.. తన భార్య మెడికల్ కండిషన్ గురించి తెలిసి కూడా ఆమె కుటుంబం తనతో వివాహం జరిపించారని ఆరోపించాడు. పెళ్లికి మూడేళ్ల ముందు నుంచే ఆమె హార్మోన్ల సమస్యకు మందులు వాడుతోందని ఆరోపించాడు. దీంతో ఆమెను వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

ట్రయల్ కోర్టు ఆదేశాలను ఆమె హైకోర్టులో సవాల్ చేసింది. అక్కడ ఆమెకు అనుకూలంగా తీర్పు రావడంతో భర్త సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఎస్‌కె కౌల్, ఎంఎం సుంద్రేష్ నేత్రుత్వంలోని బెంచ్ దీనిపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఆమె భర్త తరుపున వాదనలు వినిపించిన న్యాయవాది.. 'ఆమె ఒక పురుషుడు. కాబట్టి ఇది కచ్చితంగా చీటింగ్ కిందకే వస్తుంది. ఒకసారి మెడికల్ రిపోర్టులు చూడండి. ఆమె జెనెటిక్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు అందులో పేర్కొన్నబడి ఉంది. నా క్లైంట్‌కి ఒక పురుషుడిని ఇచ్చి మోసం చేశారు. ఆమెకు తన జననేంద్రియాల గురించి తెలిసి కూడా అతన్ని పెళ్లాడింది.' అని కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న కోర్టు అతని భార్య, మామలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌కి వాయిదా వేసింది.

Also Read: Tragedy: విషాదం.. చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి...

Also Read: India vs Sri Lanka 2nd Test: ముగిసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్...టీమిండియాకు 143 పరుగుల ఆధిక్యం..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News