న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా మామ్మారిపై పోరులో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి నిర్మాణాత్మక మద్దతును ఇస్తుందని, కాగా వికేంద్రీకృత విధానాన్ని అమలుపర్చడంలో కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ తనదైన శైలిలో తప్పుబట్టారు. మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. కాగా మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలపై విభేదించవచ్చు. కానీ ఇది సమయం కాదని, అందరూ ఏకమై ఈ సమస్యపై పోరాడాడాలని పిలుపునిచ్చారు.
Read Also: ఆ మొబైల్ యాప్‌తో తస్మాత్ జాగ్రత్త! కేంద్రం హెచ్చరిక
ఇదిలాఉండగా వీడియో కాన్ఫెరెన్సులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని దేశం నుండి పారదోలడానికి సమిష్టి కృషి అవసరమని, ప్రతి ఒక్కరు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలన్నారు. అంతేకాకుండా నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలనుకుంటున్నానని, తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. దాదాపుగా గంటసేపు జరిగిన పరస్పర చర్చల్లో విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, పూర్తి స్థాయిలో ప్రజలకు కరోనాకు సంబంధించి పరీక్షలు నిర్వహించకుంటే COVID-19 ను నియంత్రించలేమని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధానమంత్రి రాష్ట్రాలకు అన్నీ రకాల వసతులు కల్పించాలని, రాష్ట్రాలకు వికేంద్రీకరించబడటానికి మరింత శక్తిని కల్గించాలని, వనరులు కల్పించాలని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం,రాష్ట్రాలు వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా అన్నీ రకాల మౌలికమైన అంశాలపై దృష్టి సారించాలని, మరోవైపు ప్రస్తుతమున్న కరోనా రహిత ప్రాంతాలను హాట్స్పాట్లుగా మారకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లాక్డౌన్ వైరస్ వ్యాప్తిని కొద్దిరోజుల వరకు ఆపగలగడానికి మాత్రమే సహాయపడుతుందని, కానీ పూర్తిస్థాయిలో నిర్మూలన సాధ్యం కాదన్నారు. కనుక దీనికి ఏకైక మార్గం పరీక్షలను చేయడమన్నారు.