Covid19: ఇండియాలో పెరుగుతున్న రికవరీ రేటు

కరోనా సంక్రమణ ( Corona spread ) నేపధ్యంలో గణాంకాాలు ఎంతగా భయపెడుతున్నా కాస్త ఊరట నిచ్చే అంశాలు కూడా కన్పిస్తున్నాయి. అదే రికవరీ రేటు ( Recovery rate ) . కరోనా రికవరీ రేటు  భారతదేశంలో పెరుగుతుండటం ఆశావహ పరిణామంగా కన్పిస్తోంది. 

Last Updated : Jul 14, 2020, 06:06 PM IST
Covid19: ఇండియాలో పెరుగుతున్న రికవరీ రేటు

కరోనా సంక్రమణ ( Corona spread ) నేపధ్యంలో గణాంకాాలు ఎంతగా భయపెడుతున్నా కాస్త ఊరట నిచ్చే అంశాలు కూడా కన్పిస్తున్నాయి. అదే రికవరీ రేటు ( Recovery rate ) . కరోనా రికవరీ రేటు  భారతదేశంలో పెరుగుతుండటం ఆశావహ పరిణామంగా కన్పిస్తోంది. 

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల్లో భారతదేశం మూడో స్థానంలో  నిలిచింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటివరకూ 9 లక్షలు దాటింది. అయితే రికవరీ రేటు కూడా ఎక్కువే ఉండటం ఊరటనిచ్చే అంశమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ( Central Health Minister ) ప్రకటించింది. ఇటీవలి కాలంలో యాక్టివ్ కేసుల కంటే రికవరీ రేటు పెరిగిందని తెలుస్తోంది. మే 2 నుంచి 30 తేదీ మధ్య కాలంలో  కోలుకున్నవారి సంఖ్య కంటే కరోనా రోగుల సంఖ్య అధికంగా ఉంది. కానీ ఇప్పుడు యాక్టివ్ కేసుల కంటే...రికవరీ రేటు 1.8 రెట్లు అధికంగా ఉంది. దేశంలో 20 రాష్ట్రాల సరాసరి రికవరీ రేటు కూడా జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉండటం ఆనందించాల్సిన విషయం. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు ( Corona virus recovery rate ) 63 శాతం ఉంది. కరోనా వైరస్ కేసుల వృద్ధిరేటు కూడా దేశంలో గణనీయంగా తగ్గుతోందన్న విషయం గమనించాలని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. Also read: Sachin Pilot: సత్యాన్ని ఓడించలేరు

వ్యాక్సిన్ లో భారతదేశ పాత్ర కీలకం

ఇక వ్యాక్సిన్ ( Vaccine ) విషయంలో భారత్ కు చెందిన రెండు కంపెనీలకు క్లినికల్ ఫేజ్ హ్యూమన్ ట్రయల్స్ ( Human Trials ) కు అనుమతి లభించిందని..రెండు కంపెనీలకు చెరో వేయి మంది వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారని ఐసీఎంఆర్ తెలిపింది. వ్యాక్సిన్ రంగంలో గతం నుంచీ భారతదేశానిదే పైచేయి అని ఐసీఎంఆర్ ( ICMR ) ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్న వివిధ రకాల వ్యాక్సిన్ లలో 60 శాతం ఇండియాలో తయారైనవేనని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. Also read: Rajastan crisis: పైలట్ చేతుల్లో ఏం లేదు.. డ్రామా అంతా బీజేపిదే: అశోక్ గెహ్లట్

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x