Foreign Minister Jaishankar tests covid positive: కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు బయటపడటంతో వైద్య పరీక్షలు చేయించుకున్న ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి జైశంకర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవలి కాలంలో తనను కలిసినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. జైశంకర్ త్వరగా కోలుకోవాలని కేంద్రమంత్రి దర్మేంద్ర ప్రధాన్ సహా పలువురు ప్రముఖులు ట్వీట్ చేశారు.
Have tested Covid positive.
Urge all those who have come in recent contact to take suitable precautions.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 27, 2022
గురువారం (జనవరి 27) ఉదయం ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-వైవ్స్ లే డ్రియాన్‌తో జైశంకర్ వర్చువల్‌గా భేటీ అయ్యారు. ఇండియా-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై భేటీలో ఇరు దేశాల మంత్రులు చర్చించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు క్రమంగా బలపడుతూ వస్తున్నాయని... దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు ఇదే అనువైన సమయమని ఈ సందర్భంగా జైశంకర్ అభిప్రాయపడ్డారు.
'రక్షణ రంగం, అంతరిక్షం, న్యూక్లియర్‌కు సంబంధించి భారత్‌కు ఫ్రాన్స్ దీర్ఘకాల భాగస్వామిగా ఉంది. నమ్మకమైన భాగస్వామిగా కొనసాగుతోంది. కాబట్టే ఫ్రాన్స్‌తో (France) సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని భారత ప్రభుత్వం (Indian Govt) భావిస్తోంది. భౌగోళికంగా ఇరు దేశాలు వేర్వేరుగా ఉండొచ్చు.. అయితే పెద్ద సమస్యలపై స్పందించాల్సి వచ్చినప్పుడు ఇద్దరి ఆలోచనా ధోరణి ఒకేలా ఉంటుంది.' అని తాజా భేటీలో జైశంకర్ పేర్కొన్నారు.
Also Read: Shweta Tiwari: దేవుడు నా 'బ్రా' కొలతలు తీసుకుంటున్నాడు.. నటి వివాదాస్పద వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook