India Corona Cases Today: ఇండియాలో మరోసారి తగ్గిన కోవిడ్19 మరణాలు, మెరుగ్గా డిశ్ఛార్జ్ కేసులు

India Corona Cases Live Updates:  కరోనా మరణాలు తాజాగా మరోసారి 3 వేల కంటే తక్కువ సంభవించాయి. కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పలు విదేశీ వ్యాక్సిన్లకు సైతం అనుమతులు ఇస్తోంది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సరఫరా చేస్తోంది.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 3, 2021, 11:32 AM IST
  • ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతోంది
  • కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు క్రమంగా తగ్గుతున్నాయి
  • కొత్తగా 1,34,154 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు
India Corona Cases Today: ఇండియాలో మరోసారి తగ్గిన కోవిడ్19 మరణాలు, మెరుగ్గా డిశ్ఛార్జ్ కేసులు

India Corona Cases Live Updates: ఇండియాలో కరోనా తగ్గుముఖం పడుతోంది. కోవిడ్19 పాజిటివ్ కేసులు క్రమక్రమంగా దిగొస్తున్నాయి. కరోనా మరణాలు తాజాగా మరోసారి 3 వేల కంటే తక్కువ సంభవించాయి. కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పలు విదేశీ వ్యాక్సిన్లకు సైతం అనుమతులు ఇస్తోంది. 

ఇండియాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,34,154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జూన్ 2న దేశ వ్యాప్తంగా 21,59,873 (21.59 లక్షలు) శాంపిల్స్ పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. తాజా కేసులతో కలిపితే దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,84,41,986 (2 కోట్ల 84 లక్షల 41 వేల 986)కు చేరుకుంది. నిన్నటితో పోల్చితే కోవిడ్19 మరణాలు తగ్గాయి. కరోనా (CoronaVirus)తో పోరాడుతూ మరో 2,887 మంది చనిపోగా, ఇప్పటివరకూ కోవిడ్19తో మరణించిన వారి సంఖ్య 3,37,989కి చేరుకుంది.

Also Read: Covid-19 Free Village: కరోనా ఫ్రీ విలేజ్ కాంపిటీషన్స్, రూ.50 లక్షల ప్రైజ్‌మనీ ప్రకటన

తాజాగా 2,11,499 (2 లక్షల 11 వేల 499) మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ 2,63,90,584 (2 కోట్ల 63 లక్షల 90 వేల 584) మంది కోవిడ్19ను జయించి ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు. ఇండియాలో ఇప్పటివరకూ 35,37,82,648 (35 కోట్ల 37 లక్షల 82 వేల 648) శాంపిల్స్‌కు కోవిడ్19 (Covid-19 Infections) నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఐసీఎంఆర్ తాజా ప్రకటనలో వెల్లడించింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News