India Corona Cases Updates: ఇండియాలో లక్ష దిగువకు కరోనా కేసులు, 3.5 లక్షలు దాటిన కోవిడ్-19 మరణాలు

India reports less than 1 lakh daily new corona cases after 63 days: లాక్‌డౌన్, కర్ఫూల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో కేసులు తగ్గడంతో దేశవ్యాప్తంగా 24 గంటలలో లక్ష దిగువన కరోనా కేసులు నమోదయ్యాయి. 63 రోజుల తరువాత దేశంలో కరోనా కేసులు లక్ష దిగువకు చేరుకున్నాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 9, 2021, 05:13 PM IST
  • దేశంలో 63 రోజుల తరువాత లక్ష దిగువకు కరోనా పాజిటివ్ కేసులు
  • ఓవరాల్‌గా 66 రోజుల తరువాత భారత్‌లో అతి తక్కువ కేసులు నమోదు
  • తాజాగా 2,123 మంది కోవిడ్-19తో పోరాడుతూ మరణించారు
India Corona Cases Updates: ఇండియాలో లక్ష దిగువకు కరోనా కేసులు, 3.5 లక్షలు దాటిన కోవిడ్-19 మరణాలు

India reports less than 1 lakh daily new corona cases: ఇండియాలో గత రెండు నెలలు ఉధృతంగా ఉన్న కరోనా సెకండ్ వేవ్ ప్రభావం మరింతగా తగ్గింది. లాక్‌డౌన్, కర్ఫూల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో కేసులు తగ్గడంతో దేశవ్యాప్తంగా 24 గంటలలో లక్ష దిగువన కరోనా కేసులు నమోదయ్యాయి. 63 రోజుల తరువాత దేశంలో కరోనా కేసులు లక్ష దిగువన నమోదైనట్లు అధికారులు తెలిపారు. 

భారత్‌లో గడిచిన 24 గంటల్లో 18,73,485 (18 లక్షల 73 వేల 485) శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 86,498 మందికి పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి ఇప్పటివరకూ దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసులు (India Corona Cases Updates) 2,89,96,473 (2 కోట్ల 89 లక్షల 96వేల 473)కు చేరుకున్నాయి. తాజాగా 2,123 మంది కోవిడ్-19తో పోరాడుతూ మరణించారు. ఇండియాలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,51,309కు చేరింది. 

Also Read: Black fungus cases: దేశంలో 28,252 బ్లాక్ ఫంగస్ కేసులు.. ఆ 2 రాష్ట్రాల్లోనే అత్యధికం 

సోమవారం ఒక్కరోజు దేశవ్యాప్తంగా 18 లక్షల 73 వేల 485 శాంపిల్స్‌కు కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు చేశారు. గత ఏడాది నుంచి జూన్ 7వ తేదీ వరకు మొత్తం 36,82,07,596 (36 కోట్ల 82 లక్షల 7 వేల 596) శాంపిల్స్‌కు కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఓ ప్రకటనలో తెలిపింది.

దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటలలో 1,82,282 మంది కరోనా మహమ్మారిని జయించారు. వీరితో కలిపితే దేశంలో ఇప్పటివరకూ కోవిడ్19 (COVID-19) బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,73,41,462కు చేరుకుంది. దేశంలో యాక్టివ్ కేసులు సైతం భారీగా దిగొచ్చాయి. ప్రస్తుతం 13,03,702 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. జూన్ 7 నాటికి దేశంలో మొత్తం 23,61,98,726 (23 కోట్ల 61 లక్షల 98 వేల 726) డోసుల కరోనా టీకాలు ఇచ్చారు.

Also Read: Indian Covid-19 Variants: ఇండియన్ కోవిడ్-19 వేరియంట్స్‌కు Kappa మరియు Deltaగా నామకరణం చేసిన WHO

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News