పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై భారత్ దాడి చేయాలి: బాబా రామ్‌దేవ్

యోగా గురువు బాబా రామ్‌దేవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ భూభాగంపై దాడి చేసి తిరిగి తన అధీనంలోకి తెచ్చుకోవాలని ఆయన తెలిపారు.

Last Updated : May 14, 2018, 02:02 PM IST
పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై భారత్ దాడి చేయాలి: బాబా రామ్‌దేవ్

యోగా గురువు బాబా రామ్‌దేవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ భూభాగంపై దాడి చేసి తిరిగి తన అధీనంలోకి తెచ్చుకోవాలని ఆయన తెలిపారు. "టెర్రిరిస్టులు పాకిస్తాన్‌లో శిక్షణ తీసుకుంటారన్నది అందరికీ తెలిసిన నిజం. అందుకే కాశ్మీరులో ఉగ్రవాదాన్ని అరికట్టాలంటే భారత్ ఒకే ఒక పని చేయాలి. పీఓకే (పాకిస్టాన్ ఆక్రమిత కాశ్మీరు)ను తిరిగి తన అధీనంలోకి తెచ్చుకోవాలి" అని తెలిపారు.

అలాగే బెలూచిస్థాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న క్రమంలో.. భారత్ ఆ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కూడా రామ్ దేవ్ తెలిపారు. శనివారం పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ, 2008లో జరిగిన ముంబై దాడులకు కారణం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలేనని తెలిపిన తర్వాత రామ్‌దేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

బాబా రామ్‌దేవ్ ప్రస్తుతం గయ, నలంద ప్రాంతాలలో సంచరిస్తూ అక్కడ యోగా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నారు. అలాగే ఇటీవలే ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌ని కలిసిన రామ్ దేవ్ అతనికి ప్రాణాయామం చేయమని సలహా ఇచ్చారు. బాబా రామ్‌దేవ్ వివాదాస్పదమైన వ్యాఖ్యలతో వార్తలలో నిలవడం కొత్తేమీ కాదు.

గతంలో కూడా ఆయన రాహుల్ కన్నా ఎక్కువ ప్రజాదరణ ప్రియాంక గాంధీకి ఉందని, అయితే లింగ వివక్షను చూపించి.. మగ పిల్లాడి మీద ఉండే ప్రేమ కొద్ది సోనియా రాహుల్‌‌‌ని అధ్యక్షుడిని చేయాలని భావిస్తున్నారని తెలిపారు. రాహుల్‌ తన పేరులో గాంధీని చేర్చుకున్నా, మహాత్మా గాంధీ సిద్ధాంతాలనైతే ఆయన ఆచరించడం లేదని గతంలో బాబా రామ్‌దేవ్ అన్నారు. 

Trending News