చిదంబరంకు కోర్టులో చుక్కెదురు

చిదంబరంకు కోర్టులో చుక్కెదురు

Updated: Sep 30, 2019, 09:55 PM IST
చిదంబరంకు కోర్టులో చుక్కెదురు
File photo

న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరంకు చుక్కెదురైంది. బెయిల్ మంజూరు కోసం చిదంబరం దాఖలు చేసుకున్న రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ని ఢిల్లీ హై కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో చిదంబరం బెయిల్‌పై బయటికొస్తే, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదని.. అందువల్లే ఆయనకు బెయిల్ తిరస్కరిస్తున్నామని జడ్జి సురేష్ కుమార్ కయత్ పేర్కొన్నారు. 

సీబీఐ తరపున వాదనలు వినిపించిన తుషార్ మెహతా మాట్లాడుతూ.. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న పిటిషనర్ పి చిదంబరం మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి , మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి కావడంతోపాటు ప్రస్తుత లోక్ సభ సభ్యుడు కూడా అవడంతో ఆయన సాక్షులను ప్రభావితం చేయగల శక్తిశాలి అని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే పి చిదంబరం బెయిల్ పిటిషన్‌ని తిరస్కరిస్తున్నట్టు ఢిల్లీ హై కోర్టు పేర్కొంది.