Ashok Gehlot, Sonia Gandhi Meeting : రాహుల్, ప్రియాంకాలను కాదని.. అశోక్ గెహ్లాట్‌కు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ?

Ashok Gehlot to become Congress president ? రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి పగ్గాలు అప్పగించేందుకు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ సిద్ధమవుతున్నట్టు వచ్చిన వార్తలు రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనియాంశమయ్యాయి. 

Written by - Pavan | Last Updated : Aug 24, 2022, 06:00 PM IST
Ashok Gehlot, Sonia Gandhi Meeting : రాహుల్, ప్రియాంకాలను కాదని.. అశోక్ గెహ్లాట్‌కు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ?

Ashok Gehlot to become Congress president ? : రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి పగ్గాలు అప్పగించేందుకు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ సిద్ధమవుతున్నట్టు వచ్చిన వార్తలు రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనియాంశమయ్యాయి. ఇదే వ్యవహారంపై అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ ఆ వార్తలను తోసిపుచ్చారు. ఈ విషయంలో తనకు ఎలాంటి సమాచారం లేదని.. మీడియాలో వస్తున్న వార్తా కథనాల ద్వారానే తనకు ఈ విషయం తెలిసిందని అశోక్ గెహ్లాట్ తెలిపారు. ప్రస్తుతానికి పార్టీ తనకు అప్పగించిన పనులను క్రమం తప్పకుండా నిర్వర్తిస్తున్నానని అశోక్ గెహ్లాట్ చెప్పినట్టుగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది.  

సోనియా గాంధీ చికిత్స కోసం బుధవారం విదేశాలకు వెళ్లాల్సి ఉండగా.. అంతకంటే ఒక రోజు ముందే.. అంటే నిన్న మంగళవారమే అశోక్ గెహ్లాట్ తో సోనియా గాంధీ భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరమే అశోక్ గెహ్లాట్ కి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించేందుకు రెడీ అవుతున్నారంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే, అశోక్ గెహ్లాట్ మాత్రం సోనియా గాంధీతో జరిగిన సమావేశంలో ఏయే అంశాలు చర్చకొచ్చాయనే వివరాలు వెల్లడించేందుకు ఆసక్తి చూపించలేదు.

ఇంకొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షున్ని ఎంచుకోనున్నారు. ఈ రేసులో నిలవడానికి రాహుల్ గాంధీ సుముఖంగా లేరు. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవిపై ఆసక్తి చూపించకపోవడానికి మరో కారణం ఆయన భారత్ జోడో యాత్రతో బిజీ అవుతుండటమే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రియాంకా గాంధీకి పార్టీ పగ్గాలు అప్పచెబుతారేమో అని అనుకున్నప్పటికీ.. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలు తీసుకున్న ఆమె అందులో దారుణంగా విఫలమవడం ప్రతికూల అంశంగా మారింది. అంతేకాకుండా సోనియా గాంధీ వెంట రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ కూడా విదేశాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే అశోక్ గెహ్లాట్, సోనియా గాంధీ భేటీ అవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

రాహుల్ గాంధీపైనే ఒత్తిడి..
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే పగ్గాలు చేపట్టాల్సిందిగా ఒత్తిడి తీసుకొస్తామని కాంగ్రెస్ అగ్రనేతలు చెబుతుండగా.. మరో అగ్రనేత దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ.. రాహుల్ గాంధీ ఆసక్తి చూపించకపోతే ఆయన్ని ఎవ్వరూ బలవంతం చేయలేరని అన్నారు. ఏదేమైనా.. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని సోనియా గాంధీ వదులుకున్నట్టయితే.. కొన్ని దశాబ్ధాల అనంతరం ఆ పదవిలో గాంధీయేతర కుటుంబం నుండి మరొకరు ఆ స్థానంలోకి వచ్చినట్టే అవుతుంది. 

ఒక్క ఉపాయంతో 2 సమస్యలకు పరిష్కారం..
సోనియా గాంధీ కుటుంబానికి అశోక్ గెహ్లాట్ వీరవిధేయుడిగా కొనసాగుతున్నారు కనుక పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నిలిచే అవకాశం ఆయన్నే వరించవచ్చేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, అశోక్ గెహ్లాట్‌ని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేసినట్టయితే.. సచిన్ పైలట్‌ని రాజస్థాన్‌కి తర్వాతి ముఖ్యమంత్రిని చేయడం ద్వారా అక్కడ పార్టీలో అంతర్గతంగా నెలకొన్న అసంతృప్తులను సైతం సంతృప్తిపర్చవచ్చనే ఆలోచనలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎవరి ఊహాగానాలు ఎలా ఉన్నా.. సోనియా గాంధీ మనసులో ఏముందో ఆమె ప్రకటిస్తే కానీ తెలిసే అవకాశం లేదు.

Also Read : ADANI NDTV DEAL: మీడియా కాదు మోడియా... ఎన్డీటీవీ అదానీ డీల్ పై కేటీఆర్ సెటైర్లు

Also Read : Rajiv Gandhi Birth Anniversary: రాజీవ్ గాంధీ జయంతి.. ఇవాళే సద్భావన దివాస్ ఎందుకు ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News