Siddaramaiah is next Karnataka CM: కర్ణాటక రాష్ట్ర సీఎం ఎవరనే అంశంపై కొనసాగుతన్న ఉత్కంఠకు దాదాపుగా తెరపడింది. సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కర్ణాటక సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసినట్లు సమాచారం తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రాకపోయినా.. నేటి సాయంత్రం లోగా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఓ ప్రకటన చేసే అవకాశం ఉందని ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గురువారం సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం కూడా చేస్తారని తెలుస్తోంది.
సిద్ధరామయ్య పోటీదారు, సీఎం పదవి ఆశిస్తున్న కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు నిరాశ తప్పదు. అయితే శివకుమార్‌కు కీలక పదవి దక్కే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం లేదా మంత్రి పదవి ఆయనకు కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి. శివకుమార్‌కు సీఎం పదవి దక్కపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అతనిపై ఉన్న కేసులు సీఎం పదవి అదిరోహించడానికి అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. శివకుమార్‌పై 19 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
2013 నుంచి 2018 వరకు మంత్రిగా ఉన్న డీకే శివకుమార్ అనేక అక్రమ ఆస్తులు సంపాదించారని సీబీఐ అభియోగం మోపింది. ఇప్పటికే అక్రమాస్తుల కేసులో శివకుమార్ అరెస్టయ్యి విడుదల అయ్యారు. అంతేకాదు 135 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఆయనకు ఉంది. అధిష్టానం నిర్వహించిన రహస్య ఓటింగ్‌లో ఇది స్పష్టమైనట్లు తెలిసింది. ఈ రెండు ప్రధాన కారణాలతో కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ సిద్ధరామయ్యకే సీఎం పదవి ఇచ్చేందుకు మొగ్గుచూపినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
సిద్ధరామయ్యకు సీఎం పదవి అప్పగించేందుకు కూడా పలు కారణాలు ఉన్నాయి. అధిక మంది ఎమ్మెల్యేల మద్దతు మొదటిది. 135 ఎమ్మెల్యేలు ఉండగా.. అందులో 90 మంది ఎమ్మెల్యేల మద్దతు సిద్ధరామయ్యకే ఉందట. అంతేకాకుండా ఓబీసీ వర్గాల్లో సిద్ధరామయ్యకు మంచి ఇమేజ్ ఉంది. 2013-18 సమయంలో కర్ణాటక సీఎంగా పని చేసిన సిద్ధరామయ్యకు అవినీతి రహిత పాలన సాగించారన్న పేరుంది. రాబోయే కాలంలో పార్టీలో వర్గ విబేధాలు లేకుండా పాలన సాగిస్తారని అధిష్టానం భావించింది. ఈ క్రమంలోనే సిద్ధరామయ్యకు సీఎం పదవి కట్టబెట్టేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయించింది.
Also Read: Mohammed Siraj House: మొహ్మద్ సిరాజ్ కొత్త ఇంటికెళ్లిన కోహ్లీ, డుప్లెసిస్.. ఫొటోలు, వీడియో వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.