మోడీ ఓటమే ఏకైక లక్ష్యంగా 2019 ఎన్నికలు - జీ న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూలో జైరాం రమేష్

                                     

Last Updated : Jun 5, 2018, 01:38 PM IST
మోడీ ఓటమే ఏకైక లక్ష్యంగా 2019 ఎన్నికలు - జీ న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూలో జైరాం రమేష్

కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తో జీ న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత వచ్చిన మార్పు ..అలాగే 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ వ్యూహం గురించి జీ  న్యూస్ డిజిటల్ ఒపీనియన్ ఎడిటర్ పీయూష్ బబేల్‌తో ఆయన చాలా సేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా జైరాం రమేష్ మాట్లాడుతూ మోడీని గద్దె దించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉందన్నారు. అలాగే పార్టీ  లోపాలను సరిదిద్దుకొని భవిషత్తు వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నామన్నారు.  మహాకూటమి ఏర్పాటు చేసి ఎన్నికల రణరంగంలో బీజేపీని పగడ్భంధీగా ఎదుర్కొంటామన్నారు. జీ న్యూస్ తో  జైరాం రమేష్ ఇచ్చిన ఇంటర్వ్యూ యథాతథంగా  తెసుకుందాం...

ప్రశ్న: రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఐదు నెలలు గడుస్తోంది.. ఈ వ్యవధిలో పార్టీలో ఎలాంటి మార్పులు వచ్చాయి ?
జవాబు:  రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో విప్లవాత్మక మార్పులు జరిగాయి. సీనియర్లతో పాటు యువకులకు రాహుల్ సముచిత స్థానం ఇచ్చారు. ఒకవైపు సీనియారిటీని గౌరవిస్తూనే యువ నాయకత్వాన్ని  ప్రోత్సహిస్తున్నారు. రాహుల్ అధ్యక్ష బాధ్యతల తర్వాత పార్టీలో యువతకు ఇచ్చే ప్రాధాన్యత పెరిగింది. వారికి కాదర్యదర్శి పోస్టులతో పాటు మరిన్ని ముఖ్యమైన పోస్టులు ఇచ్చారు. ఇదే కాంగ్రెస్ లో మౌలికమైన మార్పు. యువ నాయత్వాన్ని  ప్రోత్సహించే ప్రక్రియ పార్టీలో నిరంతరం కొనసాగుతుంది.
అలాగే పార్టీలో వచ్చిన  రెండో మార్పు గురించి చెబుతా. అది వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం. ఈ పరిణమాన్ని కర్నాటక ఫలితాల తర్వాత మీరు చూసే ఉంటారు. గోవా, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ తరహాలో నిర్ణయాలు  తీసుకోవడలో ఆలస్యం చేయలేదు. అక్కడ విపక్ష పార్టీల కంటే త్వరగా నిర్ణయాలు తీసుకున్నాం. కర్నాటకలో వేగవంతమైన నిర్ణయం తీసుకోనట్లయితే  కర్నాటకలో బీజేపీ పాగా వేసేదేమో. తమ ఒక్క నిర్ణయంతో బీజేపీకి అధికారం నుంచి  దూరం చేయగలిగాం. కర్నాటక కాంగ్రెస్ చేతిలో ఉండటం తప్పని పరిస్థితి ఏర్పడింది. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు రాష్ట్రాలకే పరిమితమయ్యేది. కర్నాటక ఎన్నికల్లో వేగవంతమైన నిర్ణయాలే కాదు.. పెద్ద మనసు కూడా చూపించాం. వాస్తవానికి జేడీఎస్ చిన్న పార్టీ ..వారు మా కంటే తక్కువ సీట్లు సాధించినప్పటికీ ఎలాంటి షరతులు లేకుండా  ఆ పార్టీ చీఫ్ కుమారస్వామిని ముఖ్యమంత్రి  ఇచ్చాం. అలాగే ఆర్ధిక మంత్రిత్వశాఖ వారికే వదిలేశాం. కాగా తమ పార్టీ కర్నాటక ఎన్నికల సమయంలో ఇంత వేగవంతమైన నిర్ణయం తీసుకోవడంతో తోటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆశ్యర్యానికి గురయ్యారు. అసలు ఇది కాంగ్రెస్  పార్టీయా లేదంటే మరో పార్టీయా అని ఆశ్చర్యపోయారు.

ప్రశ్న: రాహుల్ పార్టీ అధ్యక్ష బాధ్యతల తర్వాత  నిర్ణయాలు వేగంగా జరుగుతున్నాయంటే... అంటే సోనియా అధ్యక్షురాలుగా ఉన్న సమయంలో నిర్ణయాల్లో జాప్యం జరిగేవని అర్ధం చేసుకోవచ్చా ?

జవాబు: ఇలాంటి తరహా పోలిక సరైంది కాదు. ఇక్కడ చూసినట్లయితే సోనియా, రాహుల్ మధ్య 25 ఏళ్ల వ్యత్యాసం ఉంది. వేవవంతమైన నిర్ణయాలు అనేవి యువత సొంతం..ఇలాంటి మార్పు ఆహ్వానించదగింది.

ప్రశ్న: మీరు మహాకూటమి గురించి మాట్లాడుతున్నారు కదా.. ఎక్కడెక్కడ మహాకూటమిగా ఏర్పడే అవకాశముందనుకుంటున్నారు ?
జవాబు: యూపీలోని గోరఖ్ పూర్ , ఫూల్‌పూర్ మరియు కౌరాన్ ఈ మూడు ప్రాంతాల్లో మహాకూటమి ఏర్పాటు పాజిటివ్ ఫలితాన్ని ఇచ్చింది. మొన్న జరిగిన ఉపఎన్నికల్లో కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. అందుకే  మహాకూటమి ఫార్మలాతోనే 2109 ఎన్నికల్లో బరిలోకి దిగతాం. యూపీలో ఎస్పీ, బీఎస్పీ  మరియు కాంగ్రెస్ పార్టీ లు కలిసి వచ్చే ఎన్నికల్లో పోరాడుతాయి. బీహార్‌లో ఆర్జేడీతో కాంగ్రెస్ బంధం ఉంది. ఇంకా మాతో కలిసి వచ్చే పార్టీలను కలుపుపోతాం. జార్భండ్ లో జేఎంఎం మరియు జేవిఎంతో కలిసి  కూటమిగా ఏర్పడి పోరాడతాం. కేరళలో తమ మహాకూటమే ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. ఇక కర్నాటక విషయంలో జేడీఎస్‌తో దోస్తీ కొనసాగుతుంది. తెలంగాణలో కూడా కూటమిగా ఏర్పడుతాం. పశ్చిమ బెంగాల్ లో కూడా మహాకూటమి  ఉంటుంది.. రాజస్థాన్ , మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్‌గఢ్ లో బీఎస్పితో సమన్వయం చేయాలని భావిస్తున్నాయి. మహారాష్ట్రలో ఎన్సీపీ ఎలాగూ ఉంది. వీరంతా మాకు ఎన్నికల ముందు మిత్రులు. ఎన్నికల తర్వాత  మహాకూటమిలో మరి కొన్ని  పార్టీలు చేరుతాయని భావిస్తున్నాం.

ప్రశ్న: మహాకూటమి అంటున్నారు కదా.. మహారాష్ట్రలో శివసేన, బీహార్ లో జేడీయు మహాకూటమితో చేతులు కలుపుతాయా...ఇది సాధ్యమేనా ?

జవాబు: శివసేన ఎన్నికల ముందు కూటమిలో చేరే అవకాశం లేదు. అక్కడ సాధ్యమైనంత వరకు తమతో కలిసి వచ్చే పార్టీలతో  జతకడతాం. జేడీయూ విషయానకి వస్తే గంటల్లో నిర్ణయాలు మార్చుకునే వారిని కలుపుకోవడం కష్టసాధ్యం.  నితీష్ కుమార్ తనకు మంచి మిత్రుడే కానీ ఆయనపై నమ్మకం పెట్టుకోలేము. నితీష్ కుమార్ బీజేపీతో వెళ్లాలనుకుంటే ఆయన్ను ఎన్నికలకు ముందే ఈ విషయాన్ని స్పష్టం చేయాలి. 

ప్రశ్న: మహాకూటమి ఏర్పాటు ప్రయత్నం‌లో కదా.. ఇదే జరిగితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పోరాడేందుకు 250 సీట్లు మిగులుతాయా అన్న అనుమానం కలుగుతుంది..ఇంత తక్కువ స్థానాల్లో పోటీ చేస్తే కాంగ్రెస్ స్థాయి  తగ్గిపోదా ?

జవాబు: అన్ని పరిస్ధితులపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ లక్ష్యం నరేంద్ర మోడీని గద్దె దించడం ఒక్కటే.. అందుకు మహాకూటమి ఏర్పాటు అనివార్యం. ఏ ఏ స్థానాల్లో అయితే కాంగ్రెస్ బలంగా ఉంటుంటో అక్కడ పోటీ  చేస్తాం..ఎక్కడైతే బలహీనం ఉంటామో అక్కడ మిత్ర పక్షాలకు అవకాశం కల్పిస్తాం.. ఇదే కాంగ్రెస్ పార్టీ ధర్మం. ఈ విషయమైతే చెప్పగలను వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 500 సీట్ల కంటే తక్కవ సంఖ్యలో పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే  ఎన్ని స్థానాల్లో పోటీ చేయగలమనేది ఇప్పుడే చెప్పలేం కదా.. ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి.. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మోడీని గద్దె దించి తీరుంది.

ప్రశ్న: మీ మాటలను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ మూడో ఫ్రండ్ నేతృత్వంలో నడిచేందుకైనా సిద్ధమన్నట్లు ఉంది..అందుకు మీరు సిద్ధమేనా ?

జవాబు:  మూడు, నాల్గు , ఐదో ఫ్రంట్స్ అనేవి లేవు. ఇవన్ని ఊహాజనితమే. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో  ఒక వైపు మోడీ రెండో వైపు విపక్షాలు ఉంటాయి. విపక్ష పార్టీల లక్ష్యం ఒక్కటే.. అది మోడీ ఓటమి. 

ప్రశ్న: మహాకూటమి విషయం సరే. గత ఎన్నికల్ల కాంగ్రెస్ ముస్లింలకు అనుకూల పార్టీగా ముద్రపడింది. దీన్ని ఎలా చెరిపివేస్తారు ?

జవాబు: 2019 ఎన్నికలు మోడీ హామీలు- అమలు చుట్టూ తిరుతాయి. అవి ఏ మేరకు అమలు చేశారన్నదే ప్రధాన అంశం. ఏదైతే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొందో.. అది పరిస్థితిని అలాగే 2019 ఎన్నికల్లో నరేంద్ర మోడీ  ఎదుర్కొంటారు.. ఒకే అంశంపై ఈ ఎన్నికలు నడుస్తాయి. మోడీ ప్రభుత్వం ఇచ్చిన అబద్దపు హామీలను ఎండగట్టడమే కాంగ్రెస్ ముందున్న కర్తవ్యం

ప్రశ్న: గత ఎన్నికల్లో ఏపీలో జరిగిన నష్టాన్ని ఎలా భర్తీ చేసుకుంటారు ?
జవాబు: ఏపీ విభజన అనేది కాంగ్రెస్ చేసుకున్న స్వయంకృతాపరాధం.. అది మాకు సెల్ఫ్ గోల్ లాంటిది.  ఎక్కడైతే కాంగ్రెస్ కు 20కిపైగా లోక్ సభ స్థానలు దక్కుతాయో అక్కడ మేం జీరోకు పడిపోయాం. ఇదే సమయంలో ఒక్క విషయం నేను చెప్పదల్చుకున్నా.. ఇక్కడ ఫెయిల్ అవ్వడం వల్ల తెలంగాణలో లాభం జరిగిందని చెప్పవచ్చు. కాగా తమ నిర్ణయం వల్ల పార్టీ అయితే నష్టపోయింది కానీ ప్రాంతానికి మాత్రం లాభమే జరిగింది. మీరు వెళ్లి చూడండి అక్కడ హైదరాబాద్ వరకు పరిమితమైన అభివృద్ధి ఈ రోజు మొత్తం ఆంధ్ర, తెలంగాణాలో జరుగుతోంది. విభజనతో పార్టీకి నష్టం జరిగినా రాష్ట్రాలకు మేలు జరుగుతోంది.

ప్రశ్న: ప్రచారం విషయంలో మోడీతో కాంగ్రెస్ ఢీ కొట్టగలదా ?

జవాబు: ఇక్కడ ఒక్క విషయం అంగీకరించాల్సి ఉంది. నరేంద్ర మోడీ ప్రపంచలోనే మంచి కమ్యూనికేటర్. ఆ విషయంలో ఆయన మాస్టర్ అని చెప్పుకోవాలి. మోడీ లాంటి కమ్యునికేషన్ కు తమకు రాదు. మోడీ అబద్ధాన్ని నిజం చేసి చెప్పగు  సత్తా ఉంది.. కాంగ్రెస్ కు అబద్ధం చెప్పలేని బలహీనత ఉంది. జనం సత్యం మరియు అసత్యాన్ని తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ విషయం తేటతెల్లమౌతుంది. 

ప్రశ్న: బీజేపీ చీఫ్ అమిత్ షా రాజనీతి వ్యూహాలు పన్నడం దిట్టం అంటారు కదూ.. ఆయన వ్యూహాలను మీరు ఎలా తట్టుకోగలరు ?

జవాబు:  మీడియా మాత్రమే అమిత్ షాను ఆకాశానికి ఎత్తేసింది. వాస్తవానికి ఆయన అంత పెద్ద వ్యూహకర్త ఏమీ కాదు. ఆయనకు కొనడం..అమ్మడం మాత్రమే తెలుసు. కొన్ని సందర్భంగా అది సక్సెస్ అయి ఉండవచ్చు కానీ.. అన్ని వేళ్లల్లో సాధ్యపడదు.  కర్నాటక ఎన్నికలు మరియు ఇటీవలే జరిగిన ఉప ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది. వాస్తవానికి అమిత్ షా చెప్పేవన్ని అబ్బద్ధాలే ... అయితే ఆయన జీవితంలో ఒక్కసారే నిజం చెప్పారు. నల్లథనం బయటికి వస్తే ప్రతి వ్యక్తికి 15 లక్షలు వస్తాయన్న మోడీ చెప్పిన విషయం ఎన్నికల వ్యహాంలో భాగం మాత్రమే అని చెప్పడం.

 ప్రశ్న: మోడీ ప్రభుత్వం నాలుగేళ్ల పనితీరును మీరు ఎలా నిర్వచిస్తారు ?

జవాబు:  మోడీ ప్రభుత్వానికి సందేశాన్ని ఇచ్చారు..Maximum Governance - Minimum Government . ఇది పూర్తిగా విరుద్ధం ఉంది.. వాస్తవానికి మోడీ సర్కార్ ను Minimum Government  Maximum Governance గా చెప్పవచ్చు.

Trending News