పబ్లిక్ ఏరియాల్లో నమాజ్ చేయకూడదన్న నిర్ణయాన్ని తప్పుబట్టిన ఓవైసీ; యూపీ సర్కార్ పై ఫైర్

పబ్లిక్ ఏరియాల్లో నమాజ్ చేయకూడదన్న పోలీసులు నిర్ణయాన్ని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ఖండించారు

Last Updated : Dec 26, 2018, 11:42 AM IST
పబ్లిక్ ఏరియాల్లో నమాజ్ చేయకూడదన్న నిర్ణయాన్ని తప్పుబట్టిన ఓవైసీ; యూపీ సర్కార్ పై ఫైర్

పబ్లిక్ ఏరియాల్లో నమాజ్ చేయకూడదని నోయిడా పోలీసులు నిషేదం విధించడంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. పోలీసులు జారీ చేసిన ఆదేశాలను ఆయన తీవ్రంగా ఖండించారు. నమాజ్ చేయడంతో ప్రజలకు ఏవిధంగా అసౌకర్యం కలుగుతుంది... శాంతి సామరస్యాలకు ఏవిధింగా భంగం కలుగుతుందో చెప్పాలని ఈ సందర్భంగా పోలీసులకు ఓవైసీ ప్రశ్నించారు. పోలీసుల ఆదేశాలు ముస్లిం వర్గానికి టార్గెట్ చేసుకొని ఇచ్చినట్లుగా ఉన్నాయని  ఈ సందర్భంగా అదసుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.

ముస్లింయేతర వర్గం ఏం చేసినా తప్పుకాదు... ముస్లింలు ఏం చేసినా తప్పుగా పరిగణిస్తాం అన్నట్లు ఉందని పాలకుల వైఖరి అని ఓవైసీ తన ట్విట్టర్ వేదిగా ధ్వజమెత్తారు. మరి పబ్లిక్ ఏరియాలో ప్రార్ధనలు, పూజలు చేస్తున్నారు కదా.. నమాజ్ చేసుకుంటే తప్పేంటని పోలీసులకు ఓవైసీ ప్రశ్నించారు.

పబ్లిక్ ఏరియాలు, పార్కుల్లో నమాజ్ చేయకూడదని మంగళవారం నోయిడాలోని పలు కంపెనీలకు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని మతం రంగు పులమవద్దని..ఇది ప్రజల సౌర్యరార్ధం ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని పోలీసులు వివరణ ఇచ్చారు... అయినప్పటికీ  పోలీసుల జారీ చేసిన ఆదేశాలు వివాదాస్పదంగా మరాయి. ఇది  తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలో ఓవైసీ ఈ మేరకు స్పందించారు

 

 

Trending News