Bombay High Court: వ్యాక్సిన్ ధర అందరికీ ఒకటే ఉండాలి, 150 కే విక్రయించాలంటూ పిటీషన్

Bombay High Court: ఒకే వ్యాక్సిన్..ఒకే కంపెనీ. ధర మాత్రం మూడు రకాలు. ఇదే ఇప్పుడు తీవ్ర అభ్యంతరాలకు కారణమవుతోంది. సీరమ్ ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ కంపెనీ వ్యాక్సిన్ ధరల విషయంలో బాంబే హైకోర్టులో ఇప్పుడు పిటీషన్ దాఖలైంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 29, 2021, 10:23 AM IST
Bombay High Court: వ్యాక్సిన్ ధర అందరికీ ఒకటే ఉండాలి, 150 కే విక్రయించాలంటూ పిటీషన్

Bombay High Court: ఒకే వ్యాక్సిన్..ఒకే కంపెనీ. ధర మాత్రం మూడు రకాలు. ఇదే ఇప్పుడు తీవ్ర అభ్యంతరాలకు కారణమవుతోంది. సీరమ్ ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ కంపెనీ వ్యాక్సిన్ ధరల విషయంలో బాంబే హైకోర్టులో ఇప్పుడు పిటీషన్ దాఖలైంది.

ఇండియాలో కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. కేసుల సంఖ్య భయంకరంగా పెరుగుతోంది.మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్(Vaccination) కొనసాగుతోంది. చాలా ప్రాంతాల్లో వ్యాక్సిన్ లేక నో వ్యాక్సిన్ బోర్డులు ( No Vaccine Boards) కన్పిస్తున్నాయి. మరోవైపు మే 1 నుంచి సీరమ్ ఇనిస్టిట్యూట్(Serum Institute), భారత్ బయోటెక్ (Bharat Biotech) కంపెనీలు కొత్త ధరల్ని ప్రకటించాయి. ఒకే కంపెనీ, ఒకే వ్యాక్సిన్ అయినా సరే మూడు రకాల ధరల్ని ప్రకటించడం వివాదాస్పదమవుతోంది. తీవ్ర అభ్యంతరాలకు కారణమైంది. సీరమ్ ఇనిస్టిట్యూట్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ (Covishield) కేంద్రానికి 150 రూపాయలకు విక్రయిస్తుండగా..రాష్ట్రాలకు 3 వందలకు , ప్రైవేటు ఆసుపత్రులకు 6 వందల రూపాయలకు విక్రయిస్తోంది. మరోవైపు భారత్ బయోటెక్ ( Bharat Biotech) కేంద్రానికి 150 రూపాయలు, రాష్ట్రాలకు 6 వందలు కాగా ప్రైవేటు ఆసుపత్రులకు 12 వందలకు విక్రయిస్తోంది. 

ధరల్లో ఈ వ్యత్యాసం గురించి ప్రశ్నిస్తూ..రెండు కంపెనీలు వ్యాక్సిన్‌లకు అందరికీ సమానంగా అంటే 150 రూపాయలకే విక్రయించేలా ఆదేశించాలని కోరుతూ బాంబే హైకోర్టు ( Bombay High Court)లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరు ధరలకు విక్రయించడాన్ని న్యాయవాది ఫయాజ్ ఖాన్ సవాలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ అత్యవసరం కాబట్టి..సరఫరా, నిర్వహణను ప్రైవేట్ రంగం చేతుల్లో ఉంచకూడదని విజ్ఞప్తి చేసింది. కోవిడ్ మరణాలతో ప్రజల్లో పెరుగుతున్న భయాన్ని ఫార్మా కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయని పిటీషనర్ ఆరోపించారు.

ఇప్పుడున్న నిబంధనల ప్రకారం కంపెనీలు ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ డోసుల్లో 50 శాతాన్ని కేంద్రానికి ( Central government) విక్రయించి..మిగిలిన 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేదా ఓపెన్ మార్కెట్లో విక్రయించుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ధరను ప్రభుత్వమే నియంత్రించాలని..కంపెనీల దోపిడీకు అవకాశం ఇవ్వకూడదని తెలిపింది. ఛీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని బెంచ్ ముందుకు ఈ పిల్ విచారణకు వచ్చే అవకాశముంది.

Also read: COVID-19 Vaccine కొరత, మే 1 నుంచి మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కాదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News