Rahul Gandhi Speech in Palamuru: తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. పాలమూరు ప్రజా భేరి సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు - దొరల తెలంగాణ మధ్య ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు ఉంటే.. మరో వైపు తెలంగాణ సమాజం, నిరుద్యోగులు, మహిళలు ఉన్నారు. దొరల తెలంగాణలో ఏం జరుగుతోందో అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈ ప్రభుత్వం అతి పెద్ద మోసం కాళేశ్వరం ప్రాజెక్ట్. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ ప్రజల లక్ష కోట్ల రూపాయలను దోచేశారు. తెలంగాణ ప్రజలు, రైతులు, సామాన్య ప్రజల సొమ్మును దోచుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పిల్లర్లు కుంగిపోతున్నాయి. వాళ్ళు దోచుకున్న డబ్బుకు ప్రతి ఏడాది 2040 వరకు 31వేల రూపాయలు ప్రతి కుటుంబం కట్టాల్సి ఉంటుంది. రాష్ట్రంలో అనేక సాగు ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు, వీళ్ళు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఒకసారి చూడండి. దళితులు, ఆదివాసీలు, పేదల భూములు కాంగ్రెస్ నేతృత్వంలో తిరిగి ఇచ్చాం. చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని భూములు ఇస్తే వాటిని ధరణి పేరుతో తెలంగాణ ప్రభుత్వం గుంజుకుంటున్నారు. వారి కుటుంబానికి, బంధువులు, ప్రజా ప్రతినిధులుకు మాత్రమే ధరణి లబ్ధి చేస్తోంది.
తెలంగాణ ప్రజల సొత్తు కేసిఆర్ కుటుంబ సభ్యులకే చేరుతోంది. రెవెన్యూ, ఇసుక, మద్యం అన్ని శాఖలు ఆ కుటుంబం వద్దే ఉన్నాయి. ప్రజా తెలంగాణ కొరకు మనం పోరాడాం.. దొరల తెలంగాణ కోసం కాదు.. తెలంగాణ ఉద్యమ కలను కాంగ్రెస్ పార్టీ సాకారం చేయబోతుంది. బీజేపీ, ఎమ్ఐఎం కలిసి పని చేస్తున్నాయి. లోక్ సభలో బీజేపీకి కేసిఆర్ పూర్తి మద్దతు ఇచ్చారు. జీఎస్టీ, రైతు చట్టాల బిల్లులకు బీజేపీకి కేసిఆర్ మద్దతు ఇచ్చారు. దేశంలో ప్రతిపక్ష నాయకుల పై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్నాయి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి పై ఎలాంటి కేసులు ఉండవు. ఈ రెండు పార్టీల లక్ష్యం కాంగ్రెస్ పార్టీనీ ఓడించడమే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో బీజేపీ కోసం MIM పార్టీ పనిచేస్తోంది. ఇక్కడ BRS తో పోటి చేస్తుంటే.. మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీతో పోరాడుతున్నాము.
తెలంగాణ ప్రజలు మనసులో నిర్ణయం తీసుకున్నారు. అధికారం, మీడియా సీఎం వెంట ఉంటే... ప్రజల విశ్వాసం కాంగ్రెస్ కు ఉంది. కాంగ్రెస్ కార్యర్తలు ఎవరికి భయపడరు. కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు కలిసి ప్రజా తెలంగాణ సాకారం చేయాల్సిన అవసరం ఉంది. మాది రాజకీయ బంధం కాదు కుటుంబ బంధం. ఇందిరా గాంధీకి అత్యవసర పరిస్థితి వస్తె తెలంగాణ ప్రజలు అండగా నిలబడ్డారు. ఈ నిజాన్ని నేను ఎప్పటికీ మరవలేను. మీ పోరాటాన్ని చూసి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. అన్ని వర్గాలకు తెలంగాణ ప్రయోజనాలు దక్కుతాయని ఆశించాం.. కేవలం ఒకే కుటుంబం ఆ ప్రయోజనాలు అన్ని అనుభవిస్తోంది. మేము అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం. కర్ణాటక, ఛత్తీస్ ఘడ్, ఇలా కాంగ్రెస్ అధికారం పొందిన రాష్ట్రాల్లో మొదటి కేబినెట్ భేటీ లోనే హామీలపై నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ ప్రజల సొమ్ము సీఎం కేసిఆర్ ఎంత దోచుకున్నాడో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ సొమ్మును ప్రజలకు చెందేలా చేస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
Also Read: iPhone Tapping: దేశంలో ఫోన్ ట్యాపింగ్ దుమారం, ఫోన్లు హ్యాక్ అవుతున్నాయంటూ అలర్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..